(॥పల్లవి॥)
పలుకులు చేర్చితివే పడఁతీ
పలుకులు కప్పురపుభరణిలో నున్నవి
(॥పలు॥)
విన్నపము చేసుకోవే విభునికిని తొల్లె
విన్నసుద్దు లిఁకనేలే వేమారును
సన్నలైనాఁ జూపవే సముకానను
సన్నలు వెట్టుదురా సారె వలపులకు
(॥పలు॥)
మొక్కవే చేతులెత్తి ముమ్మారును
మొక్కలీఁ డతఁడు చూడ మొగమెత్తీనా
మిక్కిలి కాఁగిలించవే మేటివిభుని యివె
మిక్కిలి తీరిచెనే యిమ్మెయిఁ జనుజక్కవలు
(॥పలు॥)
బంతికిఁ బిలువవే నీపతిని నేఁడు పూ -
బంతినే వేటులాడితి బలుమారును
చింతదీరఁ గూడితివి శ్రీవేంకటేశు -
చింతనీడ చల్లఁగదె చెప్పరే మీరు
(||pallavi||)
palugulu sersidive paḍam̐tī
palugulu kappurabubharaṇilo nunnavi
(||palu||)
vinnabamu sesugove vibhunigini tŏllĕ
vinnasuddu lim̐kanele vemārunu
sannalainām̐ jūbave samugānanu
sannalu vĕṭṭudurā sārĕ valabulagu
(||palu||)
mŏkkave sedulĕtti mummārunu
mŏkkalīm̐ ḍadam̐ḍu sūḍa mŏgamĕttīnā
mikkili kām̐giliṁchave meḍivibhuni yivĕ
mikkili tīrisĕne yimmĕyim̐ janujakkavalu
(||palu||)
baṁtigim̐ biluvave nībadini nem̐ḍu pū -
baṁtine veḍulāḍidi balumārunu
siṁtadīram̐ gūḍidivi śhrīveṁkaḍeśhu -
siṁtanīḍa sallam̐gadĕ sĕppare mīru