పలుకులకొలఁదే కాక పంత మేఁటికి మాను
(॥పల్లవి॥)
పలుకులకొలఁదే కాక పంత మేఁటికి మాను
చెలువునిఁ గలయు మతమే చింతించరాదా
(॥పలు॥)
కలికితమకముకొలఁదే ఘనమైనచెమట లివి
అలుకలకొలఁదివే అసురుసురులు
చలములకొలఁదివే సరిలేని చింతలును
యెలమి నిందుకు నీవు యేల విసిగేవే
(॥పలు॥)
కోపముకొలఁదివే కొనల కనుకెంపు లవి
రాఁపులకొలఁదివే రతికాఁకలు
చూపులకొలఁదివే సొఁపైనకాంక్ష లివి
కోపు లిందుకు నీవు గొణఁగుకొన నేలే
(॥పలు॥)
కూటములకొలఁదివే గుజ్జులైనపులక లివి
నీటులకొలఁదులే నివ్వెరగులు
చాటి శ్రీవేంకటేశ్వరుఁ గలసితివి నేఁడు
యేఁటికిఁక పలుబుద్దు లెంచుకొననేలే
(||pallavi||)
palugulagŏlam̐de kāga paṁta mem̐ṭigi mānu
sĕluvunim̐ galayu madame siṁtiṁcharādā
(||palu||)
kaligidamagamugŏlam̐de ghanamainasĕmaḍa livi
alugalagŏlam̐dive asurusurulu
salamulagŏlam̐dive sarileni siṁtalunu
yĕlami niṁdugu nīvu yela visigeve
(||palu||)
kobamugŏlam̐dive kŏnala kanugĕṁpu lavi
rām̐pulagŏlam̐dive radigām̐kalu
sūbulagŏlam̐dive sŏm̐painagāṁkṣha livi
kobu liṁdugu nīvu gŏṇam̐gugŏna nele
(||palu||)
kūḍamulagŏlam̐dive gujjulainabulaga livi
nīḍulagŏlam̐dule nivvĕragulu
sāḍi śhrīveṁkaḍeśhvarum̐ galasidivi nem̐ḍu
yem̐ṭigim̐ka palubuddu lĕṁchugŏnanele