పలుకవే చెలియా పంత మెచ్చెనే
(॥పల్లవి॥)
పలుకవే చెలియా పంత మెచ్చెనే
చలి వాసి నీ వలపు చవు లెక్కెనే
(॥పలుకవే॥)
నీ వెంత గోపగించి నేరుపుతోఁ దిట్టి నాను
వావిరి నిండా నవ్వు వచ్చీనె నాకు
కావిరితో నీ వెంత కాఁకా దేరఁ జూచినాను
మూవంకఁ దమకమే ముంచీ నాకు
(॥పలుకవే॥)
పూఁచి పట్టి నీ వెంత బొమ్మల జంగించినాను
చాఁచి మందెమేళములు జూజుకొనీనే
రేఁచి నీవు నన్నుఁ గడు రేసు లెంత వుట్టించినా
తూఁచినట్టు కళ లెల్లా తుద ముట్టెనే
(॥పలుకవే॥)
కాతరించి నీ వెంత కాఁగిట బిగించినాను
యీతల నా కంత కంత కింపు వుట్టెనే
యేతులకు శ్రీవెంకటేశుఁడ కని కూడితి
నీతలఁపు నావలెనె నేర్పున రూ పాయనే
(||pallavi||)
palugave sĕliyā paṁta mĕchchĕne
sali vāsi nī valabu savu lĕkkĕne
(||palugave||)
nī vĕṁta gobagiṁchi nerubudom̐ diṭṭi nānu
vāviri niṁḍā navvu vachchīnĕ nāgu
kāvirido nī vĕṁta kām̐kā deram̐ jūsinānu
mūvaṁkam̐ damagame muṁchī nāgu
(||palugave||)
pūm̐si paṭṭi nī vĕṁta bŏmmala jaṁgiṁchinānu
sām̐si maṁdĕmeḽamulu jūjugŏnīne
rem̐si nīvu nannum̐ gaḍu resu lĕṁta vuṭṭiṁchinā
tūm̐sinaṭṭu kaḽa lĕllā tuda muṭṭĕne
(||palugave||)
kādariṁchi nī vĕṁta kām̐giḍa bigiṁchinānu
yīdala nā kaṁta kaṁta kiṁpu vuṭṭĕne
yedulagu śhrīvĕṁkaḍeśhum̐ḍa kani kūḍidi
nīdalam̐pu nāvalĕnĕ nerbuna rū pāyane