పలుక కూరకుండుటే పాడి నాకు । అప్పు
(॥పల్లవి॥)
పలుక కూరకుండుటే పాడి నాకు । అప్పు-
డలిగితివంటా నేమి ఆడకుమీ అయ్యా
(॥పలు॥)
మలసి నీ వాడినమాఁటలెల్లాఁ జక్కనే
కలికినాకురులే వంకలు గాని
వలచిన యిటువంటి వారము నే మేమన్నా
చలువౌనో వేఁడౌనో చవి చాలదయ్యా
(॥పలు॥)
నిక్కి నీచేఁతలు నీ మేనికి నన్నీ వన్నెలే
దిక్కుల మానగవులే తెల్లనగాని
వెక్కసాన నీపొందు వెఱవక సేయఁగాను
యక్కువౌనో తక్కువౌనో యెడ చాలదయ్యా
(॥పలు॥)
కొసరి కాగిఁట నన్నుఁ గూడ నీకుఁ జులుకనే
పసిమి నాజవ్వనమే బరఁ(రు?)వు గాని
యెసఁగ శ్రీవేంకటేశ యింకాఁ గూడి పిలువఁగ
పొఁసగునో పొసఁగదో పూఁపు చాలదయ్యా
(||pallavi||)
paluga kūraguṁḍuḍe pāḍi nāgu | appu-
ḍaligidivaṁṭā nemi āḍagumī ayyā
(||palu||)
malasi nī vāḍinamām̐ṭalĕllām̐ jakkane
kaligināgurule vaṁkalu gāni
valasina yiḍuvaṁṭi vāramu ne memannā
saluvauno vem̐ḍauno savi sāladayyā
(||palu||)
nikki nīsem̐talu nī menigi nannī vannĕle
dikkula mānagavule tĕllanagāni
vĕkkasāna nībŏṁdu vĕṟavaga seyam̐gānu
yakkuvauno takkuvauno yĕḍa sāladayyā
(||palu||)
kŏsari kāgim̐ṭa nannum̐ gūḍa nīgum̐ julugane
pasimi nājavvaname baram̐(ru?)vu gāni
yĕsam̐ga śhrīveṁkaḍeśha yiṁkām̐ gūḍi piluvam̐ga
pŏm̐saguno pŏsam̐gado pūm̐pu sāladayyā