పైఁడికత వంటిదాయ పైకొన్న నీతోడి మేలు
(॥పల్లవి॥)
పైఁడికత వంటిదాయ పైకొన్న నీతోడి మేలు
వేఁడివేఁడి కోరికలు వెల్లవిరులౌను
(॥పైఁడి॥)
తిలకించి చూడఁబోతే ద్రిష్టి దాఁకీనందువు
పలికితేనే బహుభాషిదందువు
చెలరేఁగి నవ్వితేనే సిగ్గులేనిదందువు
యెలమి నీతోడిపొందు యెందుకైనా వచ్చును
(॥పైఁడి॥)
సరసములాడితేనే చలివాసెనందువు
కరఁగితినంటే బూటకములందువు
సొరిది నీకు మొక్కితే జూటరినేనందువు
యిరవై నీతోడిపొందు యెందుకైన వచ్చును
(॥పైఁడి॥)
పైపైఁ జెయివేసితే పంతమిచ్చెనందువు
రాపుగ మెచ్చితే బీరములందువు
బాపురా శ్రీవెంకటేశ బలిమిఁ గూడితి నన్ను
యేపున నీతోడిపొందు యెందుకైనా వచ్చును
(||pallavi||)
paim̐ḍigada vaṁṭidāya paigŏnna nīdoḍi melu
vem̐ḍivem̐ḍi korigalu vĕllavirulaunu
(||paim̐ḍi||)
tilagiṁchi sūḍam̐bode driṣhṭi dām̐kīnaṁduvu
paligidene bahubhāṣhidaṁduvu
sĕlarem̐gi navvidene siggulenidaṁduvu
yĕlami nīdoḍibŏṁdu yĕṁdugainā vachchunu
(||paim̐ḍi||)
sarasamulāḍidene salivāsĕnaṁduvu
karam̐gidinaṁṭe būḍagamulaṁduvu
sŏridi nīgu mŏkkide jūḍarinenaṁduvu
yiravai nīdoḍibŏṁdu yĕṁdugaina vachchunu
(||paim̐ḍi||)
paibaim̐ jĕyiveside paṁtamichchĕnaṁduvu
rābuga mĕchchide bīramulaṁduvu
bāburā śhrīvĕṁkaḍeśha balimim̐ gūḍidi nannu
yebuna nīdoḍibŏṁdu yĕṁdugainā vachchunu