పైపైనే వున్నది బత్తి మీయిద్దరికిని
(॥పల్లవి॥)
పైపైనే వున్నది బత్తి మీయిద్దరికిని
దాపగు భోగముల తనియఁగ నోపవు
(॥పై పై॥)
సిగ్గులు వడకువే చెలువుని వద్దనింక
అగ్గలము నీజవ్వన మాఁపఁగ లేవు
యెగ్గులు పట్టకువే యేమిటికై నానిట్టే
వెగ్గళపుఁదమకము విడువనోపదు
(॥పై పై॥)
వంతులు వట్టకువే వాసికి నతనితోను
దొంతినున్న యాసోదాలు తోయఁగ లేవు
పంతములాడకువే పలుమారునప్పటిని
మంతనాన మొక్కక మాననోపవు
(॥పై పై॥)
చేతులఁ బెనఁగకువే శ్రీవేంకటేశ్వరుతోను
కాతరపు సరసము కాదనలేవు
యీతఁడిదె నినునేలె యింక మారాడకువే
యేతులనైనా నీవు యెడయఁగనోపవు
(||pallavi||)
paibaine vunnadi batti mīyiddarigini
dābagu bhogamula taniyam̐ga nobavu
(||pai pai||)
siggulu vaḍaguve sĕluvuni vaddaniṁka
aggalamu nījavvana mām̐pam̐ga levu
yĕggulu paṭṭaguve yemiḍigai nāniṭṭe
vĕggaḽabum̐damagamu viḍuvanobadu
(||pai pai||)
vaṁtulu vaṭṭaguve vāsigi nadanidonu
dŏṁtinunna yāsodālu toyam̐ga levu
paṁtamulāḍaguve palumārunappaḍini
maṁtanāna mŏkkaga mānanobavu
(||pai pai||)
sedulam̐ bĕnam̐gaguve śhrīveṁkaḍeśhvarudonu
kādarabu sarasamu kādanalevu
yīdam̐ḍidĕ ninunelĕ yiṁka mārāḍaguve
yedulanainā nīvu yĕḍayam̐ganobavu