Pagavaarinaina nimtabaraduraa yevvaraina

పగవారినైన నింతపరతురా యెవ్వరైన
Language

(॥పల్లవి॥)
పగవారినైన నింతపరతురా యెవ్వరైన
మొగమోట దలఁచుక ముంచరాదా కరుణ

(॥పగ॥)
చెక్కులెల్లాఁ బులకించె చెమరించె చెలిమేను
యెక్కడ చూచేవు చిత్త మేడ నున్నది
కక్కసించి ఆపెవంకఁ గట్టుకొనే దిఁకనేమి
చక్కని చెలియమీఁద చల్లరాదా కరుణ

(॥పగ॥)
కొప్పునెరులును వీడె కూరిములు తలకూడె
ఇప్పు డెంతపనిగద్దు యీడ నీకు
చెప్పరానిచేఁత చెలిఁ జేసి దొడ్డవాఁడ వైతి
చొప్పుగాఁగా ఆపె కిట్టె చూపరాదా కరుణ

(॥పగ॥)
సెలవుల నవ్వు నిండె చిత్తమెల్లఁ దమకించె
చలమరి వౌదు విఁక చాలించరాదా
యెలమి శ్రీవేంకటేశ ఇంతిఁ జేరి కూడితివి
మొలచినట్టె యింకా ముంచరాదా కరుణ

(||pallavi||)
pagavārinaina niṁtabaradurā yĕvvaraina
mŏgamoḍa dalam̐suga muṁcharādā karuṇa

(||paga||)
sĕkkulĕllām̐ bulagiṁchĕ sĕmariṁchĕ sĕlimenu
yĕkkaḍa sūsevu sitta meḍa nunnadi
kakkasiṁchi ābĕvaṁkam̐ gaṭṭugŏne dim̐kanemi
sakkani sĕliyamīm̐da sallarādā karuṇa

(||paga||)
kŏppunĕrulunu vīḍĕ kūrimulu talagūḍĕ
ippu ḍĕṁtabanigaddu yīḍa nīgu
sĕpparānisem̐ta sĕlim̐ jesi dŏḍḍavām̐ḍa vaidi
sŏppugām̐gā ābĕ kiṭṭĕ sūbarādā karuṇa

(||paga||)
sĕlavula navvu niṁḍĕ sittamĕllam̐ damagiṁchĕ
salamari vaudu vim̐ka sāliṁcharādā
yĕlami śhrīveṁkaḍeśha iṁtim̐ jeri kūḍidivi
mŏlasinaṭṭĕ yiṁkā muṁcharādā karuṇa