పడుచుఁ జేఁతలు గావు బాలకృష్ణుఁడు
(॥పల్లవి॥)
పడుచుఁ జేఁతలు గావు బాలకృష్ణుఁడు
తొడికీ మోవిపంటికె దుండగపుఁ గృష్ణుఁడు
(॥పడుచు॥)
వెన్న చేతఁ బట్టుకొని వేలు చాఁచి వుట్లకు
సన్న చేసిఁ గదవమ్మ జాణ కృష్ణుఁడు
కన్నెలు ద న్నెత్తుకొంటె కాఁగిటిచూవులు చూపీ
యెన్నిట తా నసకాడె యీ కృష్ణుఁడు
(॥పడుచు॥)
అంకెల దొంగెడు తానె అందపుచూపులు చల్లీ
లంకె మగనాండ్లపై లలిఁ గృష్ణుఁడు
పొంకపుచెక్కు గీఁటితె పుక్కిట లోకాలు చూపీ
సంకె లేక యశోదకు సటకాఁడు కృష్ణుఁడు
(॥పడుచు॥)
గొల్లెతలు ముద్దాడితె గురుతు లెల్లా నించె
చల్లచాడెలకాడనె సరి గృష్ణుఁడు
అల్ల శ్రీవెంకటాద్రిని అదె తుంగభద్రదరి
కొల్లలుగా వరా లిచ్చీ గోవిందకృష్ణుఁడు
(||pallavi||)
paḍusum̐ jem̐talu gāvu bālakṛṣhṇum̐ḍu
tŏḍigī movibaṁṭigĕ duṁḍagabum̐ gṛṣhṇum̐ḍu
(||paḍusu||)
vĕnna sedam̐ baṭṭugŏni velu sām̐si vuṭlagu
sanna sesim̐ gadavamma jāṇa kṛṣhṇum̐ḍu
kannĕlu da nnĕttugŏṁṭĕ kām̐giḍisūvulu sūbī
yĕnniḍa tā nasagāḍĕ yī kṛṣhṇum̐ḍu
(||paḍusu||)
aṁkĕla dŏṁgĕḍu tānĕ aṁdabusūbulu sallī
laṁkĕ maganāṁḍlabai lalim̐ gṛṣhṇum̐ḍu
pŏṁkabusĕkku gīm̐ṭidĕ pukkiḍa logālu sūbī
saṁkĕ lega yaśhodagu saḍagām̐ḍu kṛṣhṇum̐ḍu
(||paḍusu||)
gŏllĕdalu muddāḍidĕ gurudu lĕllā niṁchĕ
sallasāḍĕlagāḍanĕ sari gṛṣhṇum̐ḍu
alla śhrīvĕṁkaḍādrini adĕ tuṁgabhadradari
kŏllalugā varā lichchī goviṁdakṛṣhṇum̐ḍu