Paduguru nimtilona balavamtule

పదుగురు నింటిలోన బలవంతులే
Language

(॥పల్లవి॥)
పదుగురు నింటిలోన బలవంతులే
యెదురు మాటాడ రాదు యేమి సేయవచ్చును

(॥పదుగురు॥)
తప్పక చూచేటివారు తల దీసుకొనేవారు
యెప్పుడు నావొద్దివారు యింద రిందరే
తిప్పిటిమూతులవారు దేహము దాఁచేటివారు
చెప్పబోతే పస లేదు చెల్లఁబో సంసారమా

(॥పదుగురు॥)
చేతులు చాఁచేటివారు చెప్పితే నలిగేవారు
పోతరించి మావారు పోటుబంట్లే
జాతిరాజనాలవారు సతుల వెదకేవారు
జీతమింతా రొక్కమాయ సేయవో సంసారమా

(॥పదుగురు॥)
సిగ్గు విడిచినవారు చెంగి సకళించేవారు
దగ్గరివారికి వారు తమంతవారే
అగ్గమై శ్రీవేంకటేశుఁ డంతా విచారించుకొని
తగ్గు మొగ్గు లెల్లాఁ బాపి తగునే సంసారమా

(||pallavi||)
paduguru niṁṭilona balavaṁtule
yĕduru māḍāḍa rādu yemi seyavachchunu

(||paduguru||)
tappaga sūseḍivāru tala dīsugŏnevāru
yĕppuḍu nāvŏddivāru yiṁda riṁdare
tippiḍimūdulavāru dehamu dām̐seḍivāru
sĕppabode pasa ledu sĕllam̐bo saṁsāramā

(||paduguru||)
sedulu sām̐seḍivāru sĕppide naligevāru
podariṁchi māvāru poḍubaṁṭle
jādirājanālavāru sadula vĕdagevāru
jīdamiṁtā rŏkkamāya seyavo saṁsāramā

(||paduguru||)
siggu viḍisinavāru sĕṁgi sagaḽiṁchevāru
daggarivārigi vāru tamaṁtavāre
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍaṁtā visāriṁchugŏni
taggu mŏggu lĕllām̐ bābi tagune saṁsāramā