Padiyum badiyumgaanu paramaatmumdidanigi

పదియుఁ బదియుఁగాను పరమాత్ముఁడితనికి
Language

(॥పల్లవి॥)
పదియుఁ బదియుఁగాను పరమాత్ముఁడితనికి
వెదకి చవులు దెచ్చి విందు లిట్టె సేయరే

(॥॥)
పొలసు పైఁబారెనట బురద మేనం టెనట
యిల మన్ను మోఁచెనట యీదేవుఁడు
నెలవై నరాకాసినెత్తుటఁ దోఁగినాఁడట
కలపన్నీ రెల్లఁ బోసి కడుగరే దేహము

(॥॥)
బాఁపనజిడ్డం టెనట పట్టెనట ముమ్మురము
కై పగునల్లనికోక గట్టినాఁడట
చాపలానఁ జెంచుదానిసంగడిఁ దిరిగెనట
కోపులఁ గప్పురధూళి గుప్పరే యీతనికి

(॥॥)
కాంతలనే కూడెనట కడగడ దొక్కెనట
పొంతలఁ దట్టుపణుఁగు పూయరేనేఁడు
యింతట శ్రీవేంకటేశునెద నల మేలుమంగఁ
గాంతునికి మెడఁగుచ్చి కట్టరే మొక్కుదము

(||pallavi||)
padiyum̐ badiyum̐gānu paramātmum̐ḍidanigi
vĕdagi savulu dĕchchi viṁdu liṭṭĕ seyare

(||||)
pŏlasu paim̐bārĕnaḍa burada menaṁ ṭĕnaḍa
yila mannu mom̐sĕnaḍa yīdevum̐ḍu
nĕlavai narāgāsinĕttuḍam̐ dom̐ginām̐ḍaḍa
kalabannī rĕllam̐ bosi kaḍugare dehamu

(||||)
bām̐panajiḍḍaṁ ṭĕnaḍa paṭṭĕnaḍa mummuramu
kai pagunallanigoga gaṭṭinām̐ḍaḍa
sābalānam̐ jĕṁchudānisaṁgaḍim̐ dirigĕnaḍa
kobulam̐ gappuradhūḽi guppare yīdanigi

(||||)
kāṁtalane kūḍĕnaḍa kaḍagaḍa dŏkkĕnaḍa
pŏṁtalam̐ daṭṭubaṇum̐gu pūyarenem̐ḍu
yiṁtaḍa śhrīveṁkaḍeśhunĕda nala melumaṁgam̐
gāṁtunigi mĕḍam̐guchchi kaṭṭare mŏkkudamu