పదియుఁ బదియుఁ గాను పతి నీకె వలచెను
(॥పల్లవి॥)
పదియుఁ బదియుఁ గాను పతి నీకె వలచెను
పొదిగి నీ రమణుని భోగించవమ్మా
(॥పది॥)
రెప్పవెట్టక చూచెను తప్పక లోఁ జింతించె
చప్పరించె దొండపండు సరి మోవెంటా
కప్పి నీ సింగారాలు కడుమెచ్చి లోనాయ
అప్పటనుండి పిలిచీ నాడకు రావమ్మా
(॥పది॥)
తాపమున వేఁడుకొనీ తల్లినైనఁ గోపగించీ
యేపొద్దు నిన్ను వచ్చె వెదకి యెడసివుండీ
యేపున నీడకు వచ్చె నిదివో నీకుఁ గానె
పైపై నెదురుకొని పచ్చి సేయవమ్మా
(॥పది॥)
మానుపడ్డటై వుండి మరి నీ కాఁగిట గూడీ
ఆనుకొని రాతిగుండెయై నిలిచెను
కానిమ్మని శ్రీ వేంకటపతి కొడఁబడి
డౌనె వురమెక్కితి వంతదానవమ్మా
(||pallavi||)
padiyum̐ badiyum̐ gānu padi nīgĕ valasĕnu
pŏdigi nī ramaṇuni bhogiṁchavammā
(||padi||)
rĕppavĕṭṭaga sūsĕnu tappaga lom̐ jiṁtiṁchĕ
sappariṁchĕ dŏṁḍabaṁḍu sari movĕṁṭā
kappi nī siṁgārālu kaḍumĕchchi lonāya
appaḍanuṁḍi pilisī nāḍagu rāvammā
(||padi||)
tābamuna vem̐ḍugŏnī tallinainam̐ gobagiṁchī
yebŏddu ninnu vachchĕ vĕdagi yĕḍasivuṁḍī
yebuna nīḍagu vachchĕ nidivo nīgum̐ gānĕ
paibai nĕdurugŏni pachchi seyavammā
(||padi||)
mānubaḍḍaḍai vuṁḍi mari nī kām̐giḍa gūḍī
ānugŏni rādiguṁḍĕyai nilisĕnu
kānimmani śhrī veṁkaḍabadi kŏḍam̐baḍi
ḍaunĕ vuramĕkkidi vaṁtadānavammā