పతియే దైవము తన పతియె భాగ్యఫలము
(॥పల్లవి॥)
పతియే దైవము తన పతియె భాగ్యఫలము
వెతలేల చెలులాల విభుని దూరకురే
(॥పతి॥)
చిత్తమురాఁ బతిమాట చేసితే వేడుక గాక
కత్తికోఁతఁ గొరితే కాంత యింపేనా
పత్తి యిచ్చకురాలైతే నాతఁడే మన్నించుఁ గాక
మొత్తానఁ దప్పు లెంచితే మోహము నిలుచునా
(॥పతి॥)
సమ్మతిగాఁ బెనఁగితే పతిఁ బాయకుండుఁ గాక
రొమ్మునఁ గుంపటియైతే రుచి వుట్టునా
పమ్మి ప్రియము చెప్పితే భావముఁగరఁగు గాక
యెమ్మెల విఱ్ఱవీఁగితే నెనయునా పొందులు
(॥పతి॥)
చాయపాటు చెవి నేలఁ జనుఁగాక గుమ్మడి
కాయంత ముత్తెమైతే గట్ట వచ్చునా
యీయెడ శ్రీవేంకటేశుఁడే నలమేల్మంగను
పాయక న న్నేలెఁ గాక పరులెల్లాఁ జుట్టాలా
(||pallavi||)
padiye daivamu tana padiyĕ bhāgyaphalamu
vĕdalela sĕlulāla vibhuni dūragure
(||padi||)
sittamurām̐ badimāḍa seside veḍuga gāga
kattigom̐tam̐ gŏride kāṁta yiṁpenā
patti yichchagurālaide nādam̐ḍe manniṁchum̐ gāga
mŏttānam̐ dappu lĕṁchide mohamu nilusunā
(||padi||)
sammadigām̐ bĕnam̐gide padim̐ bāyaguṁḍum̐ gāga
rŏmmunam̐ guṁpaḍiyaide rusi vuṭṭunā
pammi priyamu sĕppide bhāvamum̐garam̐gu gāga
yĕmmĕla viṭravīm̐gide nĕnayunā pŏṁdulu
(||padi||)
sāyabāḍu sĕvi nelam̐ janum̐gāga gummaḍi
kāyaṁta muttĕmaide gaṭṭa vachchunā
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelmaṁganu
pāyaga na nnelĕm̐ gāga parulĕllām̐ juṭṭālā