Padivelu mokkulu nee paadaalagu mokke nide

పదివేలు మొక్కులు నీ పాదాలకు మొక్కే నిదే
Language

(॥పల్లవి॥)
పదివేలు మొక్కులు నీ పాదాలకు మొక్కే నిదే
యిదె నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా

(॥॥)
పొత్తుల మాటలు నిన్నుఁ బొదిగి యే మాడితినో
చిత్తగించి నాపై దయ సేయవయ్యా
కొత్తలుగా నే నెంత గునిసి జంకించితినో
ఇత్తల నోరుచుకొని యింటికి రావయ్యా

(॥॥)
చెనకి నిన్నే మేమి సేఁతలు సేసితినో
మనవి చేకొని నన్ను మన్నించవయ్యా
తనివి దీరఁగ నిన్ను తప్పు లెట్టు వట్టితినో
యెనసి నవ్వు సేసుక ఇంటికి రావయ్యా

(॥॥)
కడుఁ దమకించి చనుఁగవ నిన్నె ట్టొత్తితినో
చిడిముడితో నన్ను రక్షించుకోవయ్యా
అడరి శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
యెడయ కేలితి విట్టే యింటికి రావయ్యా.

(||pallavi||)
padivelu mŏkkulu nī pādālagu mŏkke nide
yidĕ ninnu veḍugŏne niṁṭigi rāvayyā

(||||)
pŏttula māḍalu ninnum̐ bŏdigi ye māḍidino
sittagiṁchi nābai daya seyavayyā
kŏttalugā ne nĕṁta gunisi jaṁkiṁchidino
ittala norusugŏni yiṁṭigi rāvayyā

(||||)
sĕnagi ninne memi sem̐talu sesidino
manavi segŏni nannu manniṁchavayyā
tanivi dīram̐ga ninnu tappu lĕṭṭu vaṭṭidino
yĕnasi navvu sesuga iṁṭigi rāvayyā

(||||)
kaḍum̐ damagiṁchi sanum̐gava ninnĕ ṭṭŏttidino
siḍimuḍido nannu rakṣhiṁchugovayyā
aḍari śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
yĕḍaya kelidi viṭṭe yiṁṭigi rāvayyā.