పదివేలకు మామాఁట పాలించవయ్యా
(॥పల్లవి॥)
పదివేలకు మామాఁట పాలించవయ్యా
ఇదివో చెలికోరిక లీడేరుచవయ్యా
(॥పది॥)
చెప్పరాని ప్రియములు చెప్పమనె జవరాలు
వొప్పగొని చిత్తగించి వూఁకొనవయ్యా
తప్పక తనపై దయదలఁచుకొమ్మనె నిన్ను
అప్పడవి యేఁటికో అవధరించవయ్యా
(॥పది॥)
సేయరాని వూడిగాలు సేసితిఁ దా ననుమనె
ఆయెడ నింపైతే నీ వానతీవయ్యా
చేయెత్తి ముమ్మాటికిని చెలఁగి మొక్కితిననె
పాయక దేవర యిఁకఁ బరాకు మానవయ్యా
(॥పది॥)
యెన్నరాని తలపోఁత నెదురుచూచితి ననె
విన్నపమిదె పెండ్లికి విచ్చేయవయ్యా
వన్నెగా శ్రీవేంకటేశ వచ్చి యిట్టె కూడితివి
కన్నె నిట్టె పాయక మన్నించవయ్యా
(||pallavi||)
padivelagu māmām̐ṭa pāliṁchavayyā
idivo sĕligoriga līḍerusavayyā
(||padi||)
sĕpparāni priyamulu sĕppamanĕ javarālu
vŏppagŏni sittagiṁchi vūm̐kŏnavayyā
tappaga tanabai dayadalam̐sugŏmmanĕ ninnu
appaḍavi yem̐ṭigo avadhariṁchavayyā
(||padi||)
seyarāni vūḍigālu sesidim̐ dā nanumanĕ
āyĕḍa niṁpaide nī vānadīvayyā
seyĕtti mummāḍigini sĕlam̐gi mŏkkidinanĕ
pāyaga devara yim̐kam̐ barāgu mānavayyā
(||padi||)
yĕnnarāni talabom̐ta nĕdurusūsidi nanĕ
vinnabamidĕ pĕṁḍligi vichcheyavayyā
vannĕgā śhrīveṁkaḍeśha vachchi yiṭṭĕ kūḍidivi
kannĕ niṭṭĕ pāyaga manniṁchavayyā