Padivadda nemde neevu pasarimchevu

పతివద్ద నేఁడే నీవు పచరించేవు
Language

(॥పల్లవి॥)
పతివద్ద నేఁడే నీవు పచరించేవు
కతకారితనా లెందు గడిఇంచుకొంటివే

(॥పతి॥)
చిగురాకుమోవి మీఁది చిన్నలేఁతమాటలు
నిగిడి యెన్నఁడు నీవు నేరిచితివే
మొగమిచ్చలకుఁ జూచే ములువాఁడి చూపులు
తగిలి ఇన్నాళ్ళు యెందు దాఁచుకవుండితివే

(॥పతి॥)
గుత్తపు చెక్కు జెమట కొనగోరి చిమ్ములు
బిత్తరాన నెట్టు గూడపట్టుకొంచివే
చిత్తిణితనములోని చిరిసిగ్గులనవ్వులు
తిత్తిఁగట్టి యేడనుండి తెచ్చుకొంటివే

(॥పతి॥)
కదిసినయట్టిరతికళలలో గురుతులు
పొదపెట్టి యెట్టు గూడపోసుకొంటివే
అదన శ్రీవేంకటేశుఁ డట్టె నిన్ను నన్నూఁ గూడె
చదురుఁదనము లెన్ని సవరించుకొంటివే

(||pallavi||)
padivadda nem̐ḍe nīvu pasariṁchevu
kadagāridanā lĕṁdu gaḍiiṁchugŏṁṭive

(||padi||)
sigurāgumovi mīm̐di sinnalem̐tamāḍalu
nigiḍi yĕnnam̐ḍu nīvu nerisidive
mŏgamichchalagum̐ jūse muluvām̐ḍi sūbulu
tagili innāḽḽu yĕṁdu dām̐sugavuṁḍidive

(||padi||)
guttabu sĕkku jĕmaḍa kŏnagori simmulu
bittarāna nĕṭṭu gūḍabaṭṭugŏṁchive
sittiṇidanamuloni sirisiggulanavvulu
tittim̐gaṭṭi yeḍanuṁḍi tĕchchugŏṁṭive

(||padi||)
kadisinayaṭṭiradigaḽalalo gurudulu
pŏdabĕṭṭi yĕṭṭu gūḍabosugŏṁṭive
adana śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ ninnu nannūm̐ gūḍĕ
sadurum̐danamu lĕnni savariṁchugŏṁṭive