Padivadda goosumdave baagaalu sedi kiyyave

పతివద్ద గూచుండవే బాగాలు చేతి కియ్యవే
Language

(॥పల్లవి॥)
పతివద్ద గూచుండవే బాగాలు చేతి కియ్యవే
తతి గొన్న నీ వలపు దాఁచిపెట్టవచ్చునా

(॥పల్లవి॥)
వొగ్గి మాఁట లాడితేనే వొడఁబాటై వుండుఁగాక
దగ్గర కల్లంతనుంటే తమి వుట్టీనా
యెగ్గులేని చుట్టరిక మెంచినట్టె వచ్చుఁగాక
సిగ్గులు వెగ్గళమైతే చిత్తము గరఁగునా

(॥పతి॥)
ననుపుగా నవ్వితేనే నమ్మికలై వుండుఁగాక
వొనరని సరసాలు వొద్దికయ్యీనా
మనసు వచ్చిన పొందు మచ్చికలు రేఁచుఁగాక
పెనఁగులాటలైయైతే ప్రియములు వుట్టీనా

(॥పతి॥)
యెరవుగాని కాఁగిలి ఇతవులై వుండుఁగాక
పొరపొచ్చపు రతులు పొసఁగుండీనా
ఇరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
సిరులు మీ వేడుకలు చెప్పి చూపవచ్చునా

(||pallavi||)
padivadda gūsuṁḍave bāgālu sedi kiyyave
tadi gŏnna nī valabu dām̐sibĕṭṭavachchunā

(||pallavi||)
vŏggi mām̐ṭa lāḍidene vŏḍam̐bāḍai vuṁḍum̐gāga
daggara kallaṁtanuṁṭe tami vuṭṭīnā
yĕgguleni suṭṭariga mĕṁchinaṭṭĕ vachchum̐gāga
siggulu vĕggaḽamaide sittamu garam̐gunā

(||padi||)
nanubugā navvidene nammigalai vuṁḍum̐gāga
vŏnarani sarasālu vŏddigayyīnā
manasu vachchina pŏṁdu machchigalu rem̐sum̐gāga
pĕnam̐gulāḍalaiyaide priyamulu vuṭṭīnā

(||padi||)
yĕravugāni kām̐gili idavulai vuṁḍum̐gāga
pŏrabŏchchabu radulu pŏsam̐guṁḍīnā
iravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
sirulu mī veḍugalu sĕppi sūbavachchunā