Padini solaya noba badala noba

పతిని సొలయ నోప బడల నోప
Language

(॥పల్లవి॥)
పతిని సొలయ నోప బడల నోప
కతుకుఁ గాళ్ళేడఁ జెప్పి కలుచపెట్టకురే

(॥పతిని॥)
చెలువుఁడు దా నాడఁ జేసినచేఁతకు దోడు
పలుకనేఁ గమ్మరానుఁ బయికొనరా
కొలచీ నంటే కొలవఁ గొనకెక్కె లెక్క లెల్లా
వలపు నాపాలఁ బడె వాటము సేయకురే

(॥పతిని॥)
నన్నుఁ జూచి రమణుఁడు నవ్వీ నంతే చాలు
మన్నించి నేనూ నవ్వ మారుకు మారా
వెన్న నున్నఁగా నూరఁగ వెఱ్ఱి దెలిసె నింతట
వెన్నెల గాదెఁబోసెనా వేట సేయకురే

(॥పతిని॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి కూడె నదె నేఁడు
వేవేలు నంటి నేను వింతదాననా
పూవఁ బూవఁ గోరికలు పూప లాయఁ బిందెలాయ
వావిదేర మందు గద్దా వాకున నాడకురే

(||pallavi||)
padini sŏlaya noba baḍala noba
kadugum̐ gāḽḽeḍam̐ jĕppi kalusabĕṭṭagure

(||padini||)
sĕluvum̐ḍu dā nāḍam̐ jesinasem̐tagu doḍu
paluganem̐ gammarānum̐ bayigŏnarā
kŏlasī naṁṭe kŏlavam̐ gŏnagĕkkĕ lĕkka lĕllā
valabu nābālam̐ baḍĕ vāḍamu seyagure

(||padini||)
nannum̐ jūsi ramaṇum̐ḍu navvī naṁte sālu
manniṁchi nenū navva mārugu mārā
vĕnna nunnam̐gā nūram̐ga vĕṭri dĕlisĕ niṁtaḍa
vĕnnĕla gādĕm̐bosĕnā veḍa seyagure

(||padini||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu seri kūḍĕ nadĕ nem̐ḍu
vevelu naṁṭi nenu viṁtadānanā
pūvam̐ būvam̐ gorigalu pūba lāyam̐ biṁdĕlāya
vāvidera maṁdu gaddā vāguna nāḍagure