పతినేల సాదించేవు పలుమారును
(॥పల్లవి॥)
పతినేల సాదించేవు పలుమారును
అతిరాజసపువాఁడు అవుఁగాము లెరుఁగునా
(॥పతి॥)
మగవానిసాజము మానినులఁ గంటేను
నగఁ జూచుఁ గాని యెంతైనాఁ దనియఁడు
నిగిడి తొంటిపొందుల నేస్తగత్తె చెనకితే
మొగమోటఁ గూడుఁగాక ముందువెన కెంచునా
(॥పతి॥)
పాయపువానివోజ పడఁతులు పైకొంటే
చేయి చాఁచుఁ గాని మరి సిగ్గు వడఁడు
రాయడించి వదినె మరదలైన దంటితేను
ఆయాలు గరఁగుఁ గాని అందుకుఁ గాదనఁడు
(॥పతి॥)
విటుఁడైనవానివిద్య వెలఁదులు వద్దనుంటే
తటుకునఁ గూడుఁ గాని తడ వోర్వఁడు
యిటువలె శ్రీవేంకటేశుఁడు నిన్నూ నేలె
ఘటనతోఁ జనవిచ్చుఁ గాని బడి వాయఁడు
(||pallavi||)
padinela sādiṁchevu palumārunu
adirājasabuvām̐ḍu avum̐gāmu lĕrum̐gunā
(||padi||)
magavānisājamu māninulam̐ gaṁṭenu
nagam̐ jūsum̐ gāni yĕṁtainām̐ daniyam̐ḍu
nigiḍi tŏṁṭibŏṁdula nestagattĕ sĕnagide
mŏgamoḍam̐ gūḍum̐gāga muṁduvĕna kĕṁchunā
(||padi||)
pāyabuvānivoja paḍam̐tulu paigŏṁṭe
seyi sām̐sum̐ gāni mari siggu vaḍam̐ḍu
rāyaḍiṁchi vadinĕ maradalaina daṁṭidenu
āyālu garam̐gum̐ gāni aṁdugum̐ gādanam̐ḍu
(||padi||)
viḍum̐ḍainavānividya vĕlam̐dulu vaddanuṁṭe
taḍugunam̐ gūḍum̐ gāni taḍa vorvam̐ḍu
yiḍuvalĕ śhrīveṁkaḍeśhum̐ḍu ninnū nelĕ
ghaḍanadom̐ janavichchum̐ gāni baḍi vāyam̐ḍu