పతిమీఁది మోహము పడఁతి కిట్టుండవద్దా
(॥పల్లవి॥)
పతిమీఁది మోహము పడఁతి కిట్టుండవద్దా
సతతము నీ హితవే సారెఁ గోరీఁ దాను
(॥పతి॥)
బలిమి బయ్యదకొంగు పట్టి నీవు దీసి తేను
సెలఁతకొప్పువిరులు నీపై రాలెను
అలరి యందుకు మరుఁ డమ్ములు గురిసెనంటా
కలికి భ్రమసి నిన్ను కాఁగిలించుకొనెను
(॥పతి॥)
వొట్టుక నీవాపెను వొరసి పెనఁగితేను
తొటికమైకప్పురపుదూ(ధూ?) ళి నిన్నంటె
నెట్టనఁ జందురుఁడు వెన్నెలచొక్కు చల్లెనంటా
గట్టిగాఁ దెలియలేక కాఁగిలించుకొనెను
(॥పతి॥)
ఇమ్ముల శ్రీవేంకటేశ యీపె నీవు గూడితే
నెమ్మిఁ జెమటబొట్లు నీమై నిండెను
చిమ్మి యీతఁడు నించినసేసలే పైకొనెనంటా
కమ్మర నచ్చెరువంది కాఁగిలించుకొనెను
(||pallavi||)
padimīm̐di mohamu paḍam̐ti kiṭṭuṁḍavaddā
sadatamu nī hidave sārĕm̐ gorīm̐ dānu
(||padi||)
balimi bayyadagŏṁgu paṭṭi nīvu dīsi tenu
sĕlam̐tagŏppuvirulu nībai rālĕnu
alari yaṁdugu marum̐ ḍammulu gurisĕnaṁṭā
kaligi bhramasi ninnu kām̐giliṁchugŏnĕnu
(||padi||)
vŏṭṭuga nīvābĕnu vŏrasi pĕnam̐gidenu
tŏḍigamaigappurabudū(dhū?) ḽi ninnaṁṭĕ
nĕṭṭanam̐ jaṁdurum̐ḍu vĕnnĕlasŏkku sallĕnaṁṭā
gaṭṭigām̐ dĕliyalega kām̐giliṁchugŏnĕnu
(||padi||)
immula śhrīveṁkaḍeśha yībĕ nīvu gūḍide
nĕmmim̐ jĕmaḍabŏṭlu nīmai niṁḍĕnu
simmi yīdam̐ḍu niṁchinasesale paigŏnĕnaṁṭā
kammara nachchĕruvaṁdi kām̐giliṁchugŏnĕnu