Padim bedambaasina phala midivo

పతిఁ బెడఁబాసిన ఫల మిదివో
Language

(॥పల్లవి॥)
పతిఁ బెడఁబాసిన ఫల మిదివో
అతివకు ద్రిష్టాంతమైన రీతి

(॥పతి॥)
కన్నులఁబెట్టినకాటుకరసములు
కన్నెకు నిరుదెసఁ గమ్మీనిదె
పున్నమచంద్రుఁడు పొరిఁ దనలోపల-
నున్నకందు వెలినుమిసినరీతి

(॥పతి॥)
గురుకుచములపై కుంకుమచెమటలఁ
గరఁగి యిరుదెసలఁ గారె నిదె
సరి జక్కవలటు చంద్రోదయమున-
నొరలిన విరహం బుమిసినరీతి

(॥పతి॥)
శ్రీవేంకటపతి చెలి నిటు గలయఁగ
మోవితేనియలు మొనపె నిదె
చేవదేరుమరుచిగురుబాణమటు
వోవల నాములె వుమిసినరీతి

(||pallavi||)
padim̐ bĕḍam̐bāsina phala midivo
adivagu driṣhṭāṁtamaina rīdi

(||padi||)
kannulam̐bĕṭṭinagāḍugarasamulu
kannĕgu nirudĕsam̐ gammīnidĕ
punnamasaṁdrum̐ḍu pŏrim̐ danalobala-
nunnagaṁdu vĕlinumisinarīdi

(||padi||)
gurugusamulabai kuṁkumasĕmaḍalam̐
garam̐gi yirudĕsalam̐ gārĕ nidĕ
sari jakkavalaḍu saṁdrodayamuna-
nŏralina virahaṁ bumisinarīdi

(||padi||)
śhrīveṁkaḍabadi sĕli niḍu galayam̐ga
movideniyalu mŏnabĕ nidĕ
sevaderumarusigurubāṇamaḍu
vovala nāmulĕ vumisinarīdi