Padim baasi virahaanam badanele

పతిఁ బాసి విరహానఁ బడనేలే
Language

(॥పల్లవి॥)
పతిఁ బాసి విరహానఁ బడనేలే
మతిలో నున్నాఁ డతడు మక్కువఁ దలచవే

(॥॥)
పున్నమవెన్నెలలవే పూచినవనాలవిగో
కన్నెరో నీవేల యింతకాఁక బొందేవే
వన్నీటియేరులు వారీ పచ్చకప్రము రాలీ
వన్నెలతో నింత వసివాడు లేఁటికే

(॥॥)
చలిగాలి విసరీని జడిముంచె మేఘము
అలయుచు దప్పిబడనదేలే నీవు
మొలకపైరులు నిండెఁ బొదలె నిసుకదిబ్బలు
వలవంత నిపుడేల వడఁబడేవే

(॥॥)
గందవొడిదుమ్ము రేఁగె కదిసె విరులతావి
అందముగనేల వుస్సురస్సురనేవే
పొందె శ్రీవేంకటేశుఁడు పొంచి ఇంతలోనే వచ్చి
విందు మోవితేనె నెట్టు వెరగందేవే

(||pallavi||)
padim̐ bāsi virahānam̐ baḍanele
madilo nunnām̐ ḍadaḍu makkuvam̐ dalasave

(||||)
punnamavĕnnĕlalave pūsinavanālavigo
kannĕro nīvela yiṁtagām̐ka bŏṁdeve
vannīḍiyerulu vārī pachchagapramu rālī
vannĕlado niṁta vasivāḍu lem̐ṭige

(||||)
saligāli visarīni jaḍimuṁchĕ meghamu
alayusu dappibaḍanadele nīvu
mŏlagabairulu niṁḍĕm̐ bŏdalĕ nisugadibbalu
valavaṁta nibuḍela vaḍam̐baḍeve

(||||)
gaṁdavŏḍidummu rem̐gĕ kadisĕ viruladāvi
aṁdamuganela vussurassuraneve
pŏṁdĕ śhrīveṁkaḍeśhum̐ḍu pŏṁchi iṁtalone vachchi
viṁdu movidenĕ nĕṭṭu vĕragaṁdeve