Padim baasi virahaana bhramayaguve ninnu

పతిఁ బాసి విరహాన భ్రమయకువే నిన్ను
Language

(॥పల్లవి॥)
పతిఁ బాసి విరహాన భ్రమయకువే నిన్ను
మతకాన తమి రేఁచి మన్నించే నతఁడు

(॥పతి॥)
నిండుఁ జందురుఁడు గడే నీ మోము, నేఁ
డెండ లేఁటికి నాయ నీ వెన్నెల
కొండలే కదవే బాగుల చన్నులు, ఆ
గండుఁగోవెలకూఁత కారించె నలవే

(॥పతి॥)
కలికి బింబఫలము గదె నీ మోవి
పలుకుచిలుకలేల పగ లాయనే
అలులతురుము గదే అది నీకు
వలరాజు విలునారి వడిఁ బెట్టె నటవే

(॥పతి॥)
మెఱుఁగుల తీగెగదె మేను నీది
వెఱపుటమ్ము లేఁటికి వెగటాయనే
గుఱి శ్రీవేంకటేశుఁడు కూడె నిన్ను
తఱితో మున్నిటివెల్లా తలంపించె నటవే

(||pallavi||)
padim̐ bāsi virahāna bhramayaguve ninnu
madagāna tami rem̐si manniṁche nadam̐ḍu

(||padi||)
niṁḍum̐ jaṁdurum̐ḍu gaḍe nī momu, nem̐
ḍĕṁḍa lem̐ṭigi nāya nī vĕnnĕla
kŏṁḍale kadave bāgula sannulu, ā
gaṁḍum̐govĕlagūm̐ta kāriṁchĕ nalave

(||padi||)
kaligi biṁbaphalamu gadĕ nī movi
palugusilugalela paga lāyane
aluladurumu gade adi nīgu
valarāju vilunāri vaḍim̐ bĕṭṭĕ naḍave

(||padi||)
mĕṟum̐gula tīgĕgadĕ menu nīdi
vĕṟabuḍammu lem̐ṭigi vĕgaḍāyane
guṟi śhrīveṁkaḍeśhum̐ḍu kūḍĕ ninnu
taṟido munniḍivĕllā talaṁpiṁchĕ naḍave