పతికి విన్నవించరే పడఁతులాల
(॥పల్లవి॥)
పతికి విన్నవించరే పడఁతులాల
సతమై తా నిఁక నాకు చనవు లిమ్మనవే
(॥పతి॥)
వెలలేనివేడుకకు వేస టెంతైనాఁ గాదు
తలపోఁతరతులకుఁ దనివి లేదు
మొలకనవ్వులకును మొగచాటు చెప్పరాదు
యెలమితో నామోహ మెంతని చెప్పుదునే
(॥పతి॥)
తగులైన మీఁదట తనపొందు విడువదు
జిగిమించే తమకము చెప్పఁగూడదు
మొగవిచ్చకుండేసిగ్గు మొలచి పసివాడదు
యిగిరించె నావయసు యెటువలె దాఁతునే
(॥పతి॥)
కూడియున్నభావము గుదిగొని పాయదు
వీడెపుమోవిగుఱుతు వింతసేయదు
యీడనె శ్రీవేంకటేశుఁ డింతలో నన్ను నేలె
యీడుజోడయినభోగ మెంతైనాఁ గలదే
(||pallavi||)
padigi vinnaviṁchare paḍam̐tulāla
sadamai tā nim̐ka nāgu sanavu limmanave
(||padi||)
vĕlaleniveḍugagu vesa ṭĕṁtainām̐ gādu
talabom̐taradulagum̐ danivi ledu
mŏlaganavvulagunu mŏgasāḍu sĕpparādu
yĕlamido nāmoha mĕṁtani sĕppudune
(||padi||)
tagulaina mīm̐daḍa tanabŏṁdu viḍuvadu
jigimiṁche tamagamu sĕppam̐gūḍadu
mŏgavichchaguṁḍesiggu mŏlasi pasivāḍadu
yigiriṁchĕ nāvayasu yĕḍuvalĕ dām̐tune
(||padi||)
kūḍiyunnabhāvamu gudigŏni pāyadu
vīḍĕbumoviguṟudu viṁtaseyadu
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nannu nelĕ
yīḍujoḍayinabhoga mĕṁtainām̐ galade