పతికి విన్నవించరే పడఁతులాల
(॥పల్లవి॥)
పతికి విన్నవించరే పడఁతులాల
తతితోడఁ దను మదిఁ దలఁతు నే ననరే
(॥॥)
యిచ్చకమయినచెలి యేపనులైనాఁ జేయు
కచ్చు పెట్టు కున్నది కాంక్ష రేఁగును
మచ్చిక గలిగినది మందెమేళాన సొలయు
యెచ్చు కుందులెంచి మరి యెగ్గుపట్టఁ దగదే
(॥॥)
ఆసతో నుండినది ఆలకించుఁ దనమాట
వాసి గలిగినది సేవలు సేయును
బాసలు నమ్మినది తప్పని గుట్టుతో నుండు
రాసి కెక్కించి ఇది రవ్వసేయఁ దగదే
(॥॥)
యిల్లాలై వుండినది యెదుటనే కాచుకుండు
వెల్లివిరి నవ్వులది వేడ్కతో నుండు
యిల్లిదే శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
తెల్లమిగా నన్నుఁగూడె తిరమైతి ననరే
(||pallavi||)
padigi vinnaviṁchare paḍam̐tulāla
tadidoḍam̐ danu madim̐ dalam̐tu ne nanare
(||||)
yichchagamayinasĕli yebanulainām̐ jeyu
kachchu pĕṭṭu kunnadi kāṁkṣha rem̐gunu
machchiga galiginadi maṁdĕmeḽāna sŏlayu
yĕchchu kuṁdulĕṁchi mari yĕggubaṭṭam̐ dagade
(||||)
āsado nuṁḍinadi ālagiṁchum̐ danamāḍa
vāsi galiginadi sevalu seyunu
bāsalu namminadi tappani guṭṭudo nuṁḍu
rāsi kĕkkiṁchi idi ravvaseyam̐ dagade
(||||)
yillālai vuṁḍinadi yĕduḍane kāsuguṁḍu
vĕlliviri navvuladi veḍkado nuṁḍu
yillide śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
tĕllamigā nannum̐gūḍĕ tiramaidi nanare