పతికి విన్నవించఁ గదరే పడఁతులాల
(॥పల్లవి॥)
పతికి విన్నవించఁ గదరే పడఁతులాల
యీకె తెఱఁగు కతలు చెప్పనేల యతఁడే కరుణఁ జూచుఁగాక
(॥పతి॥)
చిమ్మిరేఁగి చెలియమేనఁ జెలప చెలప చెమట లూరె
వుమ్మగిలుచు మోహజలధి వుబ్బెనోకాక
ముమ్మరముగఁ గొప్పుగాను ముడిచినట్టి నెరులు చెదరె
అమ్మరో సంపెంగనాసిక కలులు బెదరెనోకాక
(॥పతి॥)
కారుకమ్మి మిగులఁ గలికి కన్నులందుఁ గెంపు దేరె
తోరమగుమదరాగరసములు తొట్టెనో కాక
నారుకొనుచు బులకగములు నవకముగను నిండుకొనియె
కోరికలు జవ్వనపుఁ బదనున కొనలుసాగెనో కాక
(॥పతి॥)
వెక్కసంపు టూర్పు లెపుడు విసరఁదొడఁగె లోలోనె
తక్కకీ తమకములు రతి కెడతాఁకుచున్నవోకాక
యిక్కడికిఁ దా వచ్చి మగువలు యేలెశ్రీ వేంకటగిరీశుఁడు
చక్కఁగా నిపు డీకె నోములు సఫలమాయనోకాక
(||pallavi||)
padigi vinnaviṁcham̐ gadare paḍam̐tulāla
yīgĕ tĕṟam̐gu kadalu sĕppanela yadam̐ḍe karuṇam̐ jūsum̐gāga
(||padi||)
simmirem̐gi sĕliyamenam̐ jĕlaba sĕlaba sĕmaḍa lūrĕ
vummagilusu mohajaladhi vubbĕnogāga
mummaramugam̐ gŏppugānu muḍisinaṭṭi nĕrulu sĕdarĕ
ammaro saṁpĕṁganāsiga kalulu bĕdarĕnogāga
(||padi||)
kārugammi migulam̐ galigi kannulaṁdum̐ gĕṁpu derĕ
toramagumadarāgarasamulu tŏṭṭĕno kāga
nārugŏnusu bulagagamulu navagamuganu niṁḍugŏniyĕ
korigalu javvanabum̐ badanuna kŏnalusāgĕno kāga
(||padi||)
vĕkkasaṁpu ṭūrbu lĕbuḍu visaram̐dŏḍam̐gĕ lolonĕ
takkagī tamagamulu radi kĕḍadām̐kusunnavogāga
yikkaḍigim̐ dā vachchi maguvalu yelĕśhrī veṁkaḍagirīśhum̐ḍu
sakkam̐gā nibu ḍīgĕ nomulu saphalamāyanogāga