పతితోడి చలములు పడతులకేఁటికే
(॥పల్లవి॥)
పతితోడి చలములు పడతులకేఁటికే
యితవు దెలుసుకోవే యీడేరుఁ బనులు
(॥పతి॥)
పెంచిపెంచి వెంగేలు పెక్కుమారు లాడుకుంటే
మంచిమాఁ టొకటాడితే మతి గరఁగు
పంచనుండి బీరముతో బడలుటకంటెను
ఇంచుక మొక్కు మొక్కితే నీడేరుఁ బనులు
(॥పతి॥)
వొట్టులు వెట్టుక లోలో నూసురసురనుకంటే
చుట్టరిక మేపాటైనా సుకము దక్కు
వెట్టరియైనవిరహన వేగినంతా వేగుకంటే
యెట్టైనాఁ బంతమిచ్చితే నీడేరుఁ బనులు
(॥పతి॥)
తలవంచుక సిగ్గులు తవ్వుకొంటా నుండుకంటే
మొలకనవ్వు నవ్వితే మొగమోటలౌ
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁగూడె
ఇల నీనేరుపులనే యీడేరుఁ బనులు
(||pallavi||)
padidoḍi salamulu paḍadulagem̐ṭige
yidavu dĕlusugove yīḍerum̐ banulu
(||padi||)
pĕṁchibĕṁchi vĕṁgelu pĕkkumāru lāḍuguṁṭe
maṁchimām̐ ṭŏgaḍāḍide madi garam̐gu
paṁchanuṁḍi bīramudo baḍaluḍagaṁṭĕnu
iṁchuga mŏkku mŏkkide nīḍerum̐ banulu
(||padi||)
vŏṭṭulu vĕṭṭuga lolo nūsurasuranugaṁṭe
suṭṭariga mebāḍainā sugamu dakku
vĕṭṭariyainavirahana veginaṁtā vegugaṁṭe
yĕṭṭainām̐ baṁtamichchide nīḍerum̐ banulu
(||padi||)
talavaṁchuga siggulu tavvugŏṁṭā nuṁḍugaṁṭe
mŏlaganavvu navvide mŏgamoḍalau
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐gūḍĕ
ila nīnerubulane yīḍerum̐ banulu