పతితోడఁ జెలియా పంతమాడే దాననా
(॥పల్లవి॥)
పతితోడఁ జెలియా పంతమాడే దాననా
ఇతవుతో నేమనినా నియ్యకొనే ననవే
(॥పతి॥)
తెగరానివానితోడ యెగసక్కె మాడనేల
మొగమిచ్చలే నెరపి మొక్కుట గాక
నగి తానూరకే యెంతనమ్మికలు సేసినాను
వెగటు లేకూరకుండే వింతసేయ ననవే
(॥పతి॥)
యేలినవానితోడ యెగసక్కె మాడనేల
నోలిగాను తప్పక చూచుట గాక
వాలాయించి తానెంత వద్దఁ గూచుండవచ్చినా
మేలుదాననై తన్ను మెచ్చు మెచ్చేననవే
(॥పతి॥)
పాయరానివానితోడ పగటులు చూపనేల
ఆయము లెరిఁగి విడె మందుట గాక
యీయెడ శ్రీవేంకటేశుఁడితఁ డిట్టె నన్నునేలె
చేయి చాఁచి పాదాలసేవ సేసేననవే
(||pallavi||)
padidoḍam̐ jĕliyā paṁtamāḍe dānanā
idavudo nemaninā niyyagŏne nanave
(||padi||)
tĕgarānivānidoḍa yĕgasakkĕ māḍanela
mŏgamichchale nĕrabi mŏkkuḍa gāga
nagi tānūrage yĕṁtanammigalu sesinānu
vĕgaḍu legūraguṁḍe viṁtaseya nanave
(||padi||)
yelinavānidoḍa yĕgasakkĕ māḍanela
noligānu tappaga sūsuḍa gāga
vālāyiṁchi tānĕṁta vaddam̐ gūsuṁḍavachchinā
meludānanai tannu mĕchchu mĕchchenanave
(||padi||)
pāyarānivānidoḍa pagaḍulu sūbanela
āyamu lĕrim̐gi viḍĕ maṁduḍa gāga
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ḍidam̐ ḍiṭṭĕ nannunelĕ
seyi sām̐si pādālaseva sesenanave