Padido virahamamdi paadi paadi solasevu

పతితో విరహమంది పాడి పాడి సొలసేవు
Language

(॥పల్లవి॥)
పతితో విరహమంది పాడి పాడి సొలసేవు
అతని నీ తగవులు అటువలెఁ గదవే

(॥పతి॥)
జక్కవలె చన్నులట చందురుఁడె మోమట
యెక్కడి చుట్టరికమే యీరెంటికి
నిక్కి అలులే కురులు నాసికమె సంపెంగ
వెక్కసపు నేస్తాలు వెగటాయఁగదవే

(॥పతి॥)
కరికుంభాలే పిరుఁదు ఘనసింహమే నడుము
సరిఁ బొందు లెటువలె జరగీనే
అరిది నెమలినడక అదివో నీ యారు పాము
గరిమఁ జెలిమి యెట్టు కడతేరీనే

(॥పతి॥)
తామెరలె కన్నులాయ తగునీనవ్వే మంచాయ
ఆముకొన్న కూటము లెట్టబ్బునే యిఁక
శ్రీమహాలక్ష్మీవి నీవు శ్రీవేంకటేశుఁడతఁడు
నేమపు పొంతనా లెట్టు నెరవేరెనే

(||pallavi||)
padido virahamaṁdi pāḍi pāḍi sŏlasevu
adani nī tagavulu aḍuvalĕm̐ gadave

(||padi||)
jakkavalĕ sannulaḍa saṁdurum̐ḍĕ momaḍa
yĕkkaḍi suṭṭarigame yīrĕṁṭigi
nikki alule kurulu nāsigamĕ saṁpĕṁga
vĕkkasabu nestālu vĕgaḍāyam̐gadave

(||padi||)
kariguṁbhāle pirum̐du ghanasiṁhame naḍumu
sarim̐ bŏṁdu lĕḍuvalĕ jaragīne
aridi nĕmalinaḍaga adivo nī yāru pāmu
garimam̐ jĕlimi yĕṭṭu kaḍaderīne

(||padi||)
tāmĕralĕ kannulāya tagunīnavve maṁchāya
āmugŏnna kūḍamu lĕṭṭabbune yim̐ka
śhrīmahālakṣhmīvi nīvu śhrīveṁkaḍeśhum̐ḍadam̐ḍu
nemabu pŏṁtanā lĕṭṭu nĕraverĕne