పదిటిలోపల నేము పదనకుం(దునొకం?)డు
(॥పల్లవి॥)
పదిటిలోపల నేము పదనకుం(దునొకం?)డు
యెదుట నుండఁగా గాక యెంతలేదు నీకు
(॥॥)
దొంగిలి వెన్నలుఁ బాలు దొడికినటులనే
యెంగిలిసేసితివి నేఁడిదె మామోవి
భంగించి పదారువేల బలిమిఁ బట్టినట్టే
చెంగట నన్నూ నీవు చేయి వట్టితివి
(॥॥)
గోవుల గాచి పాలకుండలు మోచినట్లనే
మోనరాని మాచన్నులు మోఁచితివి
దేవుల రుక్మిణీదేవిఁ దెచ్చుకొనినట్లనే
వావిరిఁ దెచ్చుకొంటివి వరుస మమ్మంటికి
(॥॥)
కొలనిలోవారిఁ జేరి కోకలంటినట్లనే
అలరి మా పోఁకముడి అంటితివి
యెలమి శ్రీవేంకటేశ యిందరిఁ బెండ్లాడినట్టే
కలసి నన్నుఁ బెండ్లాడి కడు మన్నించితివి
(||pallavi||)
padiḍilobala nemu padanaguṁ(dunŏgaṁ?)ḍu
yĕduḍa nuṁḍam̐gā gāga yĕṁtaledu nīgu
(||||)
dŏṁgili vĕnnalum̐ bālu dŏḍiginaḍulane
yĕṁgilisesidivi nem̐ḍidĕ māmovi
bhaṁgiṁchi padāruvela balimim̐ baṭṭinaṭṭe
sĕṁgaḍa nannū nīvu seyi vaṭṭidivi
(||||)
govula gāsi pālaguṁḍalu mosinaṭlane
monarāni māsannulu mom̐sidivi
devula rukmiṇīdevim̐ dĕchchugŏninaṭlane
vāvirim̐ dĕchchugŏṁṭivi varusa mammaṁṭigi
(||||)
kŏlanilovārim̐ jeri kogalaṁṭinaṭlane
alari mā pom̐kamuḍi aṁṭidivi
yĕlami śhrīveṁkaḍeśha yiṁdarim̐ bĕṁḍlāḍinaṭṭe
kalasi nannum̐ bĕṁḍlāḍi kaḍu manniṁchidivi