పతి విూఁదటి మోము సతి కిట్టుండ వద్దా
(॥పల్లవి॥)
పతి విూఁదటి మోము సతి కిట్టుండ వద్దా
సతతము నీ హితవే సారెఁ గోరీఁ దాను
(॥పతి॥)
బలిమిఁ బయ్యదకొంగు పట్టి నీవు దీసితేను
నెలఁతకొప్పువిరులు నీపై రాలెను
అల మరుఁ డందులకు నమ్ములు గురిసె నంటా
కలికి భ్రమసి నిన్నుఁ గౌఁగిలించుకొనెను
(॥పతి॥)
వొట్టి నీ వాపెతోను వొరసి పెనఁగితేను
తొట్టి నా మైకప్పురపుధూళి ని న్నంటె
నెట్టనఁ జందురుఁడు వెన్నెలచొక్కు చల్లె నంటా
గట్టిగాఁ దెలియలేక కౌఁగిలించుకొనెను
(॥పతి॥)
యిమ్మల శ్రీవేంకటేశ యీపె నీవు గూడితే
నెమ్మి జెమటబొట్టులు నీమై నిండెను
చిమ్మియందు నించిన సేసలు పైకొనె నంటా
కమ్మర నచ్చెరు వంది కౌఁగిలించుకొనెను
(||pallavi||)
padi viూm̐daḍi momu sadi kiṭṭuṁḍa vaddā
sadatamu nī hidave sārĕm̐ gorīm̐ dānu
(||padi||)
balimim̐ bayyadagŏṁgu paṭṭi nīvu dīsidenu
nĕlam̐tagŏppuvirulu nībai rālĕnu
ala marum̐ ḍaṁdulagu nammulu gurisĕ naṁṭā
kaligi bhramasi ninnum̐ gaum̐giliṁchugŏnĕnu
(||padi||)
vŏṭṭi nī vābĕdonu vŏrasi pĕnam̐gidenu
tŏṭṭi nā maigappurabudhūḽi ni nnaṁṭĕ
nĕṭṭanam̐ jaṁdurum̐ḍu vĕnnĕlasŏkku sallĕ naṁṭā
gaṭṭigām̐ dĕliyalega kaum̐giliṁchugŏnĕnu
(||padi||)
yimmala śhrīveṁkaḍeśha yībĕ nīvu gūḍide
nĕmmi jĕmaḍabŏṭṭulu nīmai niṁḍĕnu
simmiyaṁdu niṁchina sesalu paigŏnĕ naṁṭā
kammara nachchĕru vaṁdi kaum̐giliṁchugŏnĕnu