Padi vadda neduvalem bamdeeno kaani

పతి వద్ద నెటువలెఁ బండీనో కాని
Language

(॥పల్లవి॥)
పతి వద్ద నెటువలెఁ బండీనో కాని
కతకారితనముల కసుఁగంద దిపుడు

(॥॥)
కాటుక చెదరకుండఁ గలికి చూపులు చూచి
మాటలాడీఁ బెదవులు మాఁగఁ బెట్టుక
గాట్టపుఁ గస్తూరిబొ ట్టెక్కడ మాయకుండా మొక్కె
జూటరి దీనిపగటు చూడరే వో చెలులు

(॥॥)
కొప్పు జారీ నంటాను కూచున్నది కదలక
వొప్పుగఁ దమ్మ మెదుగకుండా నవ్వీని
విప్పక పయ్యద నెరివిరుగకుండాఁ గప్పె
దిప్పకాయ దీని గుట్టు తెలియరే చెలులు

(॥॥)
చన్నులు వాలకుండా సారె రవికె బిగించి
సన్న సేసె సింగారము సళ్లకుండాను
ఇన్నిటా శ్రీ వేంకటేశుఁ డితఁ డే తన్నుఁగూడె
వన్నెలాఁడి దీని ఇచ్చ వత్తమే చెలులు

(||pallavi||)
padi vadda nĕḍuvalĕm̐ baṁḍīno kāni
kadagāridanamula kasum̐gaṁda dibuḍu

(||||)
kāḍuga sĕdaraguṁḍam̐ galigi sūbulu sūsi
māḍalāḍīm̐ bĕdavulu mām̐gam̐ bĕṭṭuga
gāṭṭabum̐ gastūribŏ ṭṭĕkkaḍa māyaguṁḍā mŏkkĕ
jūḍari dīnibagaḍu sūḍare vo sĕlulu

(||||)
kŏppu jārī naṁṭānu kūsunnadi kadalaga
vŏppugam̐ damma mĕdugaguṁḍā navvīni
vippaga payyada nĕrivirugaguṁḍām̐ gappĕ
dippagāya dīni guṭṭu tĕliyare sĕlulu

(||||)
sannulu vālaguṁḍā sārĕ ravigĕ bigiṁchi
sanna sesĕ siṁgāramu saḽlaguṁḍānu
inniḍā śhrī veṁkaḍeśhum̐ ḍidam̐ ḍe tannum̐gūḍĕ
vannĕlām̐ḍi dīni ichcha vattame sĕlulu