Padi meemdi tamagaana bhramasidivimte neevu

పతి మీఁది తమకాన భ్రమసితివింతే నీవు
Language

(॥పల్లవి॥)
పతి మీఁది తమకాన భ్రమసితివింతే నీవు
అతివరో వెఱపేలే అవే నీవు గావా

(॥పతి॥)
చందురుఁ డితఁడు గాఁడే సతి నీనెమ్మోముగాని
పొంది నీనీడ జలధిఁ బొడచూపెను
మందానిలుఁడు గాఁడె మగువ నీవూర్పు గాని
గందపుఁగొండఁ దాఁకి కమ్మరా నేతెంచెను

(॥పతి॥)
కోవిలకూఁతలు గావె కొమ్మ నీయెలుఁగు గాని
యీవలఁ బ్రతిధ్వనులై యెగసె వనానను
పూవుల మొగ్గలు గానె పూఁపనీచన్నులు గాని
తావుల వసంతమాడఁ దలలెత్తెఁ బొదల

(॥పతి॥)
చిక్కుల మరుఁడు గాఁడె శ్రీవేంకటేశుఁడు గాని
తక్కి నీమనసు చూచి దగ్గరె భావమున
యిక్కువ లంటి కూడితి రిద్దిరూఁ బానుపు మీఁద
మొక్కుగాదు మోపు గాని ముంచి నీపై వేసెను

(||pallavi||)
padi mīm̐di tamagāna bhramasidiviṁte nīvu
adivaro vĕṟabele ave nīvu gāvā

(||padi||)
saṁdurum̐ ḍidam̐ḍu gām̐ḍe sadi nīnĕmmomugāni
pŏṁdi nīnīḍa jaladhim̐ bŏḍasūbĕnu
maṁdānilum̐ḍu gām̐ḍĕ maguva nīvūrbu gāni
gaṁdabum̐gŏṁḍam̐ dām̐ki kammarā nedĕṁchĕnu

(||padi||)
kovilagūm̐talu gāvĕ kŏmma nīyĕlum̐gu gāni
yīvalam̐ bradidhvanulai yĕgasĕ vanānanu
pūvula mŏggalu gānĕ pūm̐panīsannulu gāni
tāvula vasaṁtamāḍam̐ dalalĕttĕm̐ bŏdala

(||padi||)
sikkula marum̐ḍu gām̐ḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu gāni
takki nīmanasu sūsi daggarĕ bhāvamuna
yikkuva laṁṭi kūḍidi riddirūm̐ bānubu mīm̐da
mŏkkugādu mobu gāni muṁchi nībai vesĕnu