Padi kichchagamulaadi badigevaaramu nemu

పతి కిచ్చకములాడి బతికేవారము నేము
Language

(॥పల్లవి॥)
పతి కిచ్చకములాడి బతికేవారము నేము
కతకారితనము కలికివే నీవు

(॥పతి॥)
చక్కదనా లెంత లేదే సరసా లెవ్వ రాడరే
పెక్కు లాగుల నెమ్మెలు పెంచనేఁటికే
మక్కళించి నీవాడేదిమాటల కేమివచ్చెనే
నిక్కి మమ్ము నెంచితేను నీ కొలఁదివారమా

(॥పతి॥)
వేసాలకు దుద యేదే వేడుకలు బాఁతెఁటవే
వాసులనుఁ బొరలనివా రెవ్వరే
రాసికెక్కెఁ బనులెల్లా రచన లింకానేలే
నీసుద్దులన్నీ వింటి నీ కొలఁదివారమా

(॥పతి॥)
వినయా లెరఁగమటె వింత లెన్ని చూపేవే
యెనసిన మీఁద నిఁక నెరవులేలే
ననిచి మన్నించి యేలె నను శ్రీ వేంకటేశుఁడు
నినుఁ బెండ్లాడితే నేమే నీ కొలఁదివారమా

(||pallavi||)
padi kichchagamulāḍi badigevāramu nemu
kadagāridanamu kaligive nīvu

(||padi||)
sakkadanā lĕṁta lede sarasā lĕvva rāḍare
pĕkku lāgula nĕmmĕlu pĕṁchanem̐ṭige
makkaḽiṁchi nīvāḍedimāḍala kemivachchĕne
nikki mammu nĕṁchidenu nī kŏlam̐divāramā

(||padi||)
vesālagu duda yede veḍugalu bām̐tĕm̐ṭave
vāsulanum̐ bŏralanivā rĕvvare
rāsigĕkkĕm̐ banulĕllā rasana liṁkānele
nīsuddulannī viṁṭi nī kŏlam̐divāramā

(||padi||)
vinayā lĕram̐gamaḍĕ viṁta lĕnni sūbeve
yĕnasina mīm̐da nim̐ka nĕravulele
nanisi manniṁchi yelĕ nanu śhrī veṁkaḍeśhum̐ḍu
ninum̐ bĕṁḍlāḍide neme nī kŏlam̐divāramā