Padi dechchugonnayatti bhaama neegum jellelu

పతి దెచ్చుకొన్నయట్టి భామ నీకుఁ జెల్లెలు
Language

(॥పల్లవి॥)
పతి దెచ్చుకొన్నయట్టి భామ నీకుఁ జెల్లెలు
అతివరో వీరికంటె నాపె నీకు మేలు

(॥పతి॥)
కట్టినది చంద్రకావి కన్నులు మరుబాణాలు
పెట్టినకొప్పే తుమ్మెదపిండు గాదా
చుట్టరిక మిందు నేది సుదతి విరహవేళ
యెట్టు బిగించేవు రావే యిఁక నేడ యలుక

(॥పతి॥)
చిలుకలే పలుకులు చిగురుఁబట్టెము మోవి
కలికి నీచన్నులే జక్కవలు గావా
వలచిన వుండిన వేళ వారే నీకు వేఁగు గాదా
అలయక యిఁక రావే ఆయఁ బోయ నలుక

(॥పతి॥)
పొదలు చిరుఁదొడలు(?) పొందగునూర్పు లేగాలి
కొదలేనినీయెలుఁగే కోవిల గాదా
యిదివో శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడినాఁడు
పొదిగె నీవే నీమేనై పుట్ట దిఁక నలుక

(||pallavi||)
padi dĕchchugŏnnayaṭṭi bhāma nīgum̐ jĕllĕlu
adivaro vīrigaṁṭĕ nābĕ nīgu melu

(||padi||)
kaṭṭinadi saṁdragāvi kannulu marubāṇālu
pĕṭṭinagŏppe tummĕdabiṁḍu gādā
suṭṭariga miṁdu nedi sudadi virahaveḽa
yĕṭṭu bigiṁchevu rāve yim̐ka neḍa yaluga

(||padi||)
silugale palugulu sigurum̐baṭṭĕmu movi
kaligi nīsannule jakkavalu gāvā
valasina vuṁḍina veḽa vāre nīgu vem̐gu gādā
alayaga yim̐ka rāve āyam̐ boya naluga

(||padi||)
pŏdalu sirum̐dŏḍalu(?) pŏṁdagunūrbu legāli
kŏdaleninīyĕlum̐ge kovila gādā
yidivo śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍinām̐ḍu
pŏdigĕ nīve nīmenai puṭṭa dim̐ka naluga