(॥పల్లవి॥)
పదరుదురటవే పలుమారును
కుదురై మజ్జాతి(రే?) సేసుకొనఁదగుగాక
(॥పద॥)
కాఁపురాలు సేసేవారు కడు నొట్టువెట్టుదురా
కోపమెంతైనా నోర్చుకొందురు గాక
యేపురేఁగి రమణుఁడుయెంతమీరితిరిగినా
కోపుల మెల్లనే వంచుకొనవలెఁగాక
(॥పద॥)
ఇల్లాండ్లఇనవారు యెగసక్కేలాడుదురా
వుల్లాన గుట్టుసేసుక వుందురుగాక
వెల్లవిరైమగవాడు వేరేపనులు సేసితే
మెల్లనే వోజకుఁదెచ్చి మేకొందురుగాక
(॥పద॥)
కడుఁజుట్టాలైనవారు గక్కన నలుగుదురా
బెడిదపురతుల మెప్పింతురుగాక
అడరి శ్రీవేంకటేశుఁ డందరిఁ గూడి వచ్చితే
వడి నీవూఁ గూడి ఇట్టె వంపింతురుగాక
(||pallavi||)
padaruduraḍave palumārunu
kudurai majjādi(re?) sesugŏnam̐dagugāga
(||pada||)
kām̐purālu sesevāru kaḍu nŏṭṭuvĕṭṭudurā
kobamĕṁtainā norsugŏṁduru gāga
yeburem̐gi ramaṇum̐ḍuyĕṁtamīridiriginā
kobula mĕllane vaṁchugŏnavalĕm̐gāga
(||pada||)
illāṁḍla̮inavāru yĕgasakkelāḍudurā
vullāna guṭṭusesuga vuṁdurugāga
vĕllaviraimagavāḍu verebanulu seside
mĕllane vojagum̐dĕchchi megŏṁdurugāga
(||pada||)
kaḍum̐juṭṭālainavāru gakkana nalugudurā
bĕḍidaburadula mĕppiṁturugāga
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍaṁdarim̐ gūḍi vachchide
vaḍi nīvūm̐ gūḍi iṭṭĕ vaṁpiṁturugāga