Padarina maagaabani gaadu

పదరిన మాకాపని గాదు
Language

(॥పల్లవి॥)
పదరిన మాకాపని గాదు
ఇదియే విన్నప మింకాఁ జుమ్మీ

(॥పద॥)
నిలువన నాతఁడు నినుఁగని సవ్విన
కెలసి బొమల జంకించితివి
చలమీడేరక నరికిసరాయను
కల దిఁక సంతముగావలెఁజుమ్మీ

(॥పద॥)
ఆసల పతి నిన్నఁడగిఁ జెనకిన
వోసరి కుచముల నొరసితివి
తాసులవలె మీతమకుము లలరెను
యీసుల తెమరఁగింతేసుమ్మీ

(॥పద॥)
ఘనుఁడగు శ్రీవేంకటపతి గూడఁగ
మనసున నిప్పుడె మఱచితవి
చనవులు మనవులు చందములాయను
వినయమే విభునికి వేడుకసుమ్మీ

(||pallavi||)
padarina māgābani gādu
idiye vinnaba miṁkām̐ jummī

(||pada||)
niluvana nādam̐ḍu ninum̐gani savvina
kĕlasi bŏmala jaṁkiṁchidivi
salamīḍeraga narigisarāyanu
kala dim̐ka saṁtamugāvalĕm̐jummī

(||pada||)
āsala padi ninnam̐ḍagim̐ jĕnagina
vosari kusamula nŏrasidivi
tāsulavalĕ mīdamagumu lalarĕnu
yīsula tĕmaram̐giṁtesummī

(||pada||)
ghanum̐ḍagu śhrīveṁkaḍabadi gūḍam̐ga
manasuna nippuḍĕ maṟasidavi
sanavulu manavulu saṁdamulāyanu
vinayame vibhunigi veḍugasummī