Padari neegitte vinnabamulu seyamganela

పదరి నీకిట్టె విన్నపములు సేయఁగనేల
Language

(॥పల్లవి॥)
పదరి నీకిట్టె విన్నపములు సేయఁగనేల
సుదతి నీ దేవులట సొంపులు వుట్టీని

(॥పద॥)
కోరి చెలి యేపొద్దు నీకొలువు సేయఁగాను
తారుకాణై నీకు నీకే దయవుట్టీని
నోరుపుతో నప్పటి నీవూడిగాలు చేయఁగాను
నేరుపుతో నీమనసు నీకే కరఁగీని

(॥పద॥)
వనిత నీపాదాలకు వంచనతో మొక్కఁగాను
కనికరమున నీవే గారవించేవు
పెనఁగిపెనఁగి నీకుఁ బ్రియములుచెప్పఁగాను
వివి విని నీకంతలొ వేడుక వుట్టీని

(॥పద॥)
మంతనాన నుండి యాకుమడచి నీకియ్యఁగాను
సంతోసాన నాపెమోవి చవులయ్యీని
ఇంతలో శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
దొంతి సేసవెట్టి నీపొందులు జరగీని

(||pallavi||)
padari nīgiṭṭĕ vinnabamulu seyam̐ganela
sudadi nī devulaḍa sŏṁpulu vuṭṭīni

(||pada||)
kori sĕli yebŏddu nīgŏluvu seyam̐gānu
tārugāṇai nīgu nīge dayavuṭṭīni
norubudo nappaḍi nīvūḍigālu seyam̐gānu
nerubudo nīmanasu nīge karam̐gīni

(||pada||)
vanida nībādālagu vaṁchanado mŏkkam̐gānu
kanigaramuna nīve gāraviṁchevu
pĕnam̐gibĕnam̐gi nīgum̐ briyamulusĕppam̐gānu
vivi vini nīgaṁtalŏ veḍuga vuṭṭīni

(||pada||)
maṁtanāna nuṁḍi yāgumaḍasi nīgiyyam̐gānu
saṁtosāna nābĕmovi savulayyīni
iṁtalo śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
dŏṁti sesavĕṭṭi nībŏṁdulu jaragīni