Padari nee vemidigim badigim badisesevu

పదరి నీ వేమిటికిఁ బతికిఁ బతిసేసేవు
Language

(॥పల్లవి॥)
పదరి నీ వేమిటికిఁ బతికిఁ బతిసేసేవు
వుదుటుఁదనము మేననుండదా ఆపెకు

(॥పదరి॥)
మొక్కలాన నాపె నిన్ను మోవనాడెనంటాను
చిక్కని కన్నుల మీఁదఁ జీర దీసేవు
వెక్కసపు జవ్వనాన విఱ్ఱవీఁగేచెలి గాన
పక్కన నేమైనాఁ జేయఁ బాడిగాదు ఆపెకు

(॥పదరి॥)
నగుతానాపె నిన్ను నాటఁ జూచెనంటాను
పగటు పెనుఁదురుము పట్టి తీసేవు
మిగులా మరిపెమున మించినట్టి యింతిగాన
తగిలి నీకంటె మీరఁ దగదా ఆపెకు

(॥పదరి॥)
చనవుననాపె నిన్నుఁ జన్నుల నొత్తెనంటాను
కనుఁగొని యాపెమోవి గంటి సేసేవు
యెనసె నిన్ను శ్రీ వేంకటేశ నీ దేవులుగాన
చెనకి నిన్నింతసేయఁ జెల్లదా నేఁడాపెకు

(||pallavi||)
padari nī vemiḍigim̐ badigim̐ badisesevu
vuduḍum̐danamu menanuṁḍadā ābĕgu

(||padari||)
mŏkkalāna nābĕ ninnu movanāḍĕnaṁṭānu
sikkani kannula mīm̐dam̐ jīra dīsevu
vĕkkasabu javvanāna viṭravīm̐gesĕli gāna
pakkana nemainām̐ jeyam̐ bāḍigādu ābĕgu

(||padari||)
nagudānābĕ ninnu nāḍam̐ jūsĕnaṁṭānu
pagaḍu pĕnum̐durumu paṭṭi tīsevu
migulā maribĕmuna miṁchinaṭṭi yiṁtigāna
tagili nīgaṁṭĕ mīram̐ dagadā ābĕgu

(||padari||)
sanavunanābĕ ninnum̐ jannula nŏttĕnaṁṭānu
kanum̐gŏni yābĕmovi gaṁṭi sesevu
yĕnasĕ ninnu śhrī veṁkaḍeśha nī devulugāna
sĕnagi ninniṁtaseyam̐ jĕlladā nem̐ḍābĕgu