Padarevu radulagu pamtamaa yidi

పదరేవు రతులకు పంతమా యిది
Language

(॥పల్లవి॥)
పదరేవు రతులకు పంతమా యిది
పదపడి బిగిసేవు పంతమా యిది

(॥పద॥)
యెడమిచ్చి ప్రియముతో నింటికిఁ బిలువఁగాను
పడఁతితోఁ బెనఁగేవు పంతమా యిది
చిడుముడి నీతో నవ్వి చెమరించె మేనెల్లా
బడలిక చూడవు పంతమా యిది

(॥పద॥)
జలజాక్షి చన్నులు నీసంగడినే వున్నవంటా
పలుమారు బిసికేవు పంతమా యిది
కలికికన్నులచూపు కాఁడిపారె నిన్నునంటా
బలిమితోఁ దిట్టేవు పంతమా యిది

(॥పద॥)
తరుణి నీపాదాలకు దండములు వెట్టఁగాను
పరసతులఁ జూచేవు పంతమా యిది
యిరవై శ్రీవేంకటేశ యేలితి విన్నిటా నిఁక
పరగఁ దమకించేవు పంతమా యిది

(||pallavi||)
padarevu radulagu paṁtamā yidi
padabaḍi bigisevu paṁtamā yidi

(||pada||)
yĕḍamichchi priyamudo niṁṭigim̐ biluvam̐gānu
paḍam̐tidom̐ bĕnam̐gevu paṁtamā yidi
siḍumuḍi nīdo navvi sĕmariṁchĕ menĕllā
baḍaliga sūḍavu paṁtamā yidi

(||pada||)
jalajākṣhi sannulu nīsaṁgaḍine vunnavaṁṭā
palumāru bisigevu paṁtamā yidi
kaligigannulasūbu kām̐ḍibārĕ ninnunaṁṭā
balimidom̐ diṭṭevu paṁtamā yidi

(||pada||)
taruṇi nībādālagu daṁḍamulu vĕṭṭam̐gānu
parasadulam̐ jūsevu paṁtamā yidi
yiravai śhrīveṁkaḍeśha yelidi vinniḍā nim̐ka
paragam̐ damagiṁchevu paṁtamā yidi