Padaramgavachchum gaani pamtamiyyaraadu mari

పదరంగవచ్చుఁ గాని పంతమియ్యరాదు మరి
Language

(॥పల్లవి॥)
పదరంగవచ్చుఁ గాని పంతమియ్యరాదు మరి
పొదిగి ఇంతేసి నీకు బుద్ది చెప్పవలెనా

(॥పద॥)
అలుగఁ బోతే నీకే అదరించవలసీని
బలిమి చెల్లదు నీకుఁ బక్కన మాతో
తలవంచుకొంటేను తమకించ వలసీని
తెలిసినదే తేటతెల్లమిగావలెనా

(॥పద॥)
వుల్లసాన నవ్వఁబోతే వొడఁ బరచవలసీ
కల్లగా దిప్పటియట్టు గాదు మీఁదను
వొల్లక బిగియఁబోతే నుస్సురనవలసీని
యెల్లవారుఁ జూడఁగాను ఇంతేసి వలెనా

(॥పద॥)
కాలుఁ దొక్కఁబోతేను కడు మొక్కవలసీని
చాలుఁ జాలు నిఁకనేల చలపాదాలు
యేల యింక శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
మేలు మేలు సారెసారె మేలమాడవలెనా

(||pallavi||)
padaraṁgavachchum̐ gāni paṁtamiyyarādu mari
pŏdigi iṁtesi nīgu buddi sĕppavalĕnā

(||pada||)
alugam̐ bode nīge adariṁchavalasīni
balimi sĕlladu nīgum̐ bakkana mādo
talavaṁchugŏṁṭenu tamagiṁcha valasīni
tĕlisinade teḍadĕllamigāvalĕnā

(||pada||)
vullasāna navvam̐bode vŏḍam̐ barasavalasī
kallagā dippaḍiyaṭṭu gādu mīm̐danu
vŏllaga bigiyam̐bode nussuranavalasīni
yĕllavārum̐ jūḍam̐gānu iṁtesi valĕnā

(||pada||)
kālum̐ dŏkkam̐bodenu kaḍu mŏkkavalasīni
sālum̐ jālu nim̐kanela salabādālu
yela yiṁka śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
melu melu sārĕsārĕ melamāḍavalĕnā