Padamu dappinameemda pamtamichchevaa

పదము దప్పినమీఁద పంతమిచ్చేవా
Language

(॥పల్లవి॥)
పదము దప్పినమీఁద పంతమిచ్చేవా
చెదరని ఆసలెల్ల చిత్తగించరాదా

(॥పద॥)
చెప్పఁజాలక వలపు సిగ్గువడీఁగాని చెలి
చొప్పున మొకమువాడు చూడరాదా
కుప్పళించి ఇందరిలో గుట్టు విడువదుగాని
చిప్పిలె పెంజెమటలు చిత్తగించరాదా

(॥పద॥)
గుఱిగాని మనసే గుబ్బతిలీఁగాక చెలి
కఱకున సురుసురు కన్గొనరాదా
తఱి వచ్చినందాఁక తమకపడదుగాని
చిఱునవ్వుతోడి చింత చిత్తగించరాదా

(॥పద్॥)
వొలుక కుండ వయసు వొట్టి నీ కొప్పించీగాని
సొలపుల మోముకళ చూడరాదా
యెలమి శ్రీ వేంకటేశ యెనసితి వీపె నిట్టె
చెలఁగి నిన్నదె మెచ్చీ చిత్తగించరాదా

(||pallavi||)
padamu dappinamīm̐da paṁtamichchevā
sĕdarani āsalĕlla sittagiṁcharādā

(||pada||)
sĕppam̐jālaga valabu sigguvaḍīm̐gāni sĕli
sŏppuna mŏgamuvāḍu sūḍarādā
kuppaḽiṁchi iṁdarilo guṭṭu viḍuvadugāni
sippilĕ pĕṁjĕmaḍalu sittagiṁcharādā

(||pada||)
guṟigāni manase gubbadilīm̐gāga sĕli
kaṟaguna surusuru kangŏnarādā
taṟi vachchinaṁdām̐ka tamagabaḍadugāni
siṟunavvudoḍi siṁta sittagiṁcharādā

(||pat||)
vŏluga kuṁḍa vayasu vŏṭṭi nī kŏppiṁchīgāni
sŏlabula momugaḽa sūḍarādā
yĕlami śhrī veṁkaḍeśha yĕnasidi vībĕ niṭṭĕ
sĕlam̐gi ninnadĕ mĕchchī sittagiṁcharādā