పడఁతులఁ గంటేనే పట్టలేవు తమకము
(॥పల్లవి॥)
పడఁతులఁ గంటేనే పట్టలేవు తమకము
నడుమంత్రపు చెలులు నవ్వరా నిన్నును
(॥॥)
చల్లువెదమాట లాడి సంగడినే గూచుండి
చిల్లరచేఁ తలు సేసి చెక్కునొక్కేవు
యెల్లవారిలోన నన్ను నేల సిగ్గువరచేవు
కొల్లలుగ యేకతానఁ గూడఁగరాదా
(॥॥)
పగటున నగి నీ వాదము నామీఁ ద వేసి
మొగము చూచి నన్ను మొక్కుమనేవు
నిగిడి నిన్నింతలోనే నీవేల పచ్చి సేసేవు
వెగటేల మాయింటికి విచ్చేయరాదా
(॥॥)
చన్నులపైఁ జేయివేసి సరుగనఁ కాఁగిలించి
కన్నులఁ జొక్కించి మోవి గంటిసేసేవు
యిన్నిటా శ్రీవేంకటేశ యేల చిమ్మిరేఁ చేవు
మన్నించితి విట్లానే నెంమది నుండరాదా
(||pallavi||)
paḍam̐tulam̐ gaṁṭene paṭṭalevu tamagamu
naḍumaṁtrabu sĕlulu navvarā ninnunu
(||||)
salluvĕdamāḍa lāḍi saṁgaḍine gūsuṁḍi
sillarasem̐ talu sesi sĕkkunŏkkevu
yĕllavārilona nannu nela sigguvarasevu
kŏllaluga yegadānam̐ gūḍam̐garādā
(||||)
pagaḍuna nagi nī vādamu nāmīm̐ da vesi
mŏgamu sūsi nannu mŏkkumanevu
nigiḍi ninniṁtalone nīvela pachchi sesevu
vĕgaḍela māyiṁṭigi vichcheyarādā
(||||)
sannulabaim̐ jeyivesi saruganam̐ kām̐giliṁchi
kannulam̐ jŏkkiṁchi movi gaṁṭisesevu
yinniḍā śhrīveṁkaḍeśha yela simmirem̐ sevu
manniṁchidi viṭlāne nĕṁmadi nuṁḍarādā