Padamtulaala sobaanam baadarammaa

పడఁతులాల సోబానఁ బాడరమ్మా
Language

(॥పల్లవి॥)
పడఁతులాల సోబానఁ బాడరమ్మా
అడరి పెండ్లాడీని అహోబళేశుఁడు

(॥పడఁ॥)
యెదురుఁ గొండలమీఁద యిందిరాఁ దానుఁగూచుండి
మదనకళలు రేఁగ మాఁటలాడి
పదిలపుఁ జూపులనే బాసికము గట్టుక
అదివో పెండ్లాడీ నహోబలేశుఁడు

(॥పడఁ॥)
కను సన్నల మెల్లనె కాఁగిటికిఁ జేరి చేరి
చెనకుల నవ్వులనే సేసలు చల్లి
వెనుకొని మోవులను విందులు వెట్టుకొంటాను
అనిశముఁ బెండ్లాడీ నహోబళేశుఁడు

(॥పడఁ॥)
సందడింపు వేడుకల సమరతులనుఁ గూడి
కందున పెండ్లి పీఁటైన గద్దె మీఁదను
అందమైన శ్రీవేంకటాద్రి గరుడాద్రిని
అందుకొని పెండ్లాడీ నహోబళేశుఁడు

(||pallavi||)
paḍam̐tulāla sobānam̐ bāḍarammā
aḍari pĕṁḍlāḍīni ahobaḽeśhum̐ḍu

(||paḍam̐||)
yĕdurum̐ gŏṁḍalamīm̐da yiṁdirām̐ dānum̐gūsuṁḍi
madanagaḽalu rem̐ga mām̐ṭalāḍi
padilabum̐ jūbulane bāsigamu gaṭṭuga
adivo pĕṁḍlāḍī nahobaleśhum̐ḍu

(||paḍam̐||)
kanu sannala mĕllanĕ kām̐giḍigim̐ jeri seri
sĕnagula navvulane sesalu salli
vĕnugŏni movulanu viṁdulu vĕṭṭugŏṁṭānu
aniśhamum̐ bĕṁḍlāḍī nahobaḽeśhum̐ḍu

(||paḍam̐||)
saṁdaḍiṁpu veḍugala samaradulanum̐ gūḍi
kaṁduna pĕṁḍli pīm̐ṭaina gaddĕ mīm̐danu
aṁdamaina śhrīveṁkaḍādri garuḍādrini
aṁdugŏni pĕṁḍlāḍī nahobaḽeśhum̐ḍu