పడఁతుల జాడ లివి పతి యెదుట
(॥పల్లవి॥)
పడఁతుల జాడ లివి పతి యెదుట
అడఁచుకోరాదు నీవే ఆదరించవయ్యా
(॥॥)
మనసు లోపలి చింత మాటలలోఁ గొంత చూపు
కొన చూపులలోనఁ గొంత చూపును
తనరి పెదవిపై దప్పులై కొంత చూపు
వెనుకొని మొగమున వెల్లివిరై తోఁచును
(॥॥)
తాపపు మేని కాఁ కలు తమకమై కొంత చూపు
కోపవు జంకెనలై కొంత చూపును
యేపునఁ జెక్కిటి చేతి యెన్నికలై కొంత చూపు
కాఁపుర మంతటి మీఁ దఁ గలదెంతాఁ జూపు ను
(॥॥)
పట్టరాని మోహము బలుసిగ్గై కొంత చూపు
గుట్టు తొడి యడియాసై కొంత చూపును
యిట్టే శ్రీ వేంకటేశ యీకె నీవు గూడితివి
నెట్టుకొన్న వేడుకలై నెమ్మి నింతా నిండును
(||pallavi||)
paḍam̐tula jāḍa livi padi yĕduḍa
aḍam̐sugorādu nīve ādariṁchavayyā
(||||)
manasu lobali siṁta māḍalalom̐ gŏṁta sūbu
kŏna sūbulalonam̐ gŏṁta sūbunu
tanari pĕdavibai dappulai kŏṁta sūbu
vĕnugŏni mŏgamuna vĕllivirai tom̐sunu
(||||)
tābabu meni kām̐ kalu tamagamai kŏṁta sūbu
kobavu jaṁkĕnalai kŏṁta sūbunu
yebunam̐ jĕkkiḍi sedi yĕnnigalai kŏṁta sūbu
kām̐pura maṁtaḍi mīm̐ dam̐ galadĕṁtām̐ jūbu nu
(||||)
paṭṭarāni mohamu balusiggai kŏṁta sūbu
guṭṭu tŏḍi yaḍiyāsai kŏṁta sūbunu
yiṭṭe śhrī veṁkaḍeśha yīgĕ nīvu gūḍidivi
nĕṭṭugŏnna veḍugalai nĕmmi niṁtā niṁḍunu