Padamtula bramayimche pamtagaamdaa ninnu

పడఁతుల బ్రమయించే పంతగాఁడా నిన్ను
Language

(॥పల్లవి॥)
పడఁతుల బ్రమయించే పంతగాఁడా నిన్ను
విడువఁజాలకే యీవిధమైతిరా

(॥పడఁతుల॥)
వన్నెల నీమాటల వలవని తేటలూ
విన్నప్పటినుండి నీకు వెఱ్ఱిగొంటిరా
కన్నులచూపుల కడుఁదరితీపులూ
యిన్నిటాఁ దగిలి నేనిట్టయితిరా

(॥పడఁతుల॥)
ముసిముసినవ్వులు ముంగిటిలో దవ్వులు, నీ
పసలకుఁజిక్కి నేను పాయలేనురా
కోసరేనటనలూ కూరిమినటనలూ
విసువక చూచి యింత వీరిడినైతిరా

(॥పడఁతుల॥)
కలసే నీయాసలూ కమ్మటి నీబాసలూ
తలఁచి తలఁచి యిట్టె తగిలితిరా
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కలకాలమునునిదే కైకొంటిరా

(||pallavi||)
paḍam̐tula bramayiṁche paṁtagām̐ḍā ninnu
viḍuvam̐jālage yīvidhamaidirā

(||paḍam̐tula||)
vannĕla nīmāḍala valavani teḍalū
vinnappaḍinuṁḍi nīgu vĕṭrigŏṁṭirā
kannulasūbula kaḍum̐daridībulū
yinniḍām̐ dagili neniṭṭayidirā

(||paḍam̐tula||)
musimusinavvulu muṁgiḍilo davvulu, nī
pasalagum̐jikki nenu pāyalenurā
kosarenaḍanalū kūriminaḍanalū
visuvaga sūsi yiṁta vīriḍinaidirā

(||paḍam̐tula||)
kalase nīyāsalū kammaḍi nībāsalū
talam̐si talam̐si yiṭṭĕ tagilidirā
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
kalagālamununide kaigŏṁṭirā