పడఁతు లిందరిలోనా బత్తి నాకే నెరపీని
(॥పల్లవి॥)
పడఁతు లిందరిలోనా బత్తి నాకే నెరపీని
వుడివోని చేఁతల నన్నోడించవలెనా
(॥పడఁ॥)
ఆమని తనరతుల నలసి నే నుండఁగాను
యేమిటికి వేడుకొనీ నింకాఁ దాను
ప్రియము గలవాఁడవు ప్రియ మెంత చేసీని
సోమించి ఇప్పడే నాకుఁ జూపఁగవలెనా
(॥పడఁ॥)
ముట్టి తన చెనకుల ములుకుచునుండఁగాను
అట్టె యేల తడవీని అప్పటిఁ దాను
దిట్ట తానే ఇన్నిటాను తెలిసి రిందరు నేఁడు
మెటి(ట్టి?) తన బీరాలు మెరయఁగ వలెనా
(॥పడఁ॥)
నను పైన సరసాన నవ్వుతా నేనుండఁగాను
పెనఁగి యెంత కూడీనే బెరసి తాను
ఘనుఁడైన శ్రీ వేంకటపతి తానౌను
చనవిచ్చి యీవేళనే జట్టిగొనవలెనా
(||pallavi||)
paḍam̐tu liṁdarilonā batti nāge nĕrabīni
vuḍivoni sem̐tala nannoḍiṁchavalĕnā
(||paḍam̐||)
āmani tanaradula nalasi ne nuṁḍam̐gānu
yemiḍigi veḍugŏnī niṁkām̐ dānu
priyamu galavām̐ḍavu priya mĕṁta sesīni
somiṁchi ippaḍe nāgum̐ jūbam̐gavalĕnā
(||paḍam̐||)
muṭṭi tana sĕnagula mulugusunuṁḍam̐gānu
aṭṭĕ yela taḍavīni appaḍim̐ dānu
diṭṭa tāne inniḍānu tĕlisi riṁdaru nem̐ḍu
mĕḍi(ṭṭi?) tana bīrālu mĕrayam̐ga valĕnā
(||paḍam̐||)
nanu paina sarasāna navvudā nenuṁḍam̐gānu
pĕnam̐gi yĕṁta kūḍīne bĕrasi tānu
ghanum̐ḍaina śhrī veṁkaḍabadi tānaunu
sanavichchi yīveḽane jaṭṭigŏnavalĕnā