పడఁతి యిందులకె భ్రమసితినే
(॥పల్లవి॥)
పడఁతి యిందులకె భ్రమసితినే
నిడుపుఁగుఱుచ లివి నేర్చితివే
(॥పడ॥)
చిక్కవినవ్వులు శిరసుల నవ్వులు
వొక్కటఁ గులుకుచు వొలుకకువే
పుక్కిటివూర్పులు బూమెలనేర్పులు
మిక్కిలిఁ గంటిని మెచ్చితినే
(॥పడ॥)
కెరలినచూపులు కెమ్మోవితీపులు
సరిసరి నొక్కట జరపకువే
మరువపుఁబులకలు మాఁటలఅలకలు
అరుదుగఁ గంటిని అవునౌనే
(॥పడ॥)
వేగిరపురతులును వేడుకమతులును
పోగాయ నెమ్మెలఁ బొరలకువే
యీగతి శ్రీవేంకటేశుఁడ నేనిదె
బాగుగఁ గూడితి పదరకువే
(||pallavi||)
paḍam̐ti yiṁdulagĕ bhramasidine
niḍubum̐guṟusa livi nersidive
(||paḍa||)
sikkavinavvulu śhirasula navvulu
vŏkkaḍam̐ gulugusu vŏlugaguve
pukkiḍivūrbulu būmĕlanerbulu
mikkilim̐ gaṁṭini mĕchchidine
(||paḍa||)
kĕralinasūbulu kĕmmovidībulu
sarisari nŏkkaḍa jarabaguve
maruvabum̐bulagalu mām̐ṭalaalagalu
arudugam̐ gaṁṭini avunaune
(||paḍa||)
vegiraburadulunu veḍugamadulunu
pogāya nĕmmĕlam̐ bŏralaguve
yīgadi śhrīveṁkaḍeśhum̐ḍa nenidĕ
bāgugam̐ gūḍidi padaraguve