పడఁతి వలపులెల్లా బయటఁబడెను నేఁడు
(॥పల్లవి॥)
పడఁతి వలపులెల్లా బయటఁబడెను నేఁడు
కడలేని ప్రియముతో కాఁగిలించవయ్యా
(॥పడఁ॥)
సతిచెమటలేరులు చన్నులవెంటఁ గారఁగాఁ
దతితో సిగ్గులువడీఁదా నిన్నుఁ జూచి
మతితోఁబరవశాలు మచ్చికలుఁ దొట్టఁగాను
రతిఁ దేలగిలఁ జూచీ రవ్వగా కన్నులను
(॥పడఁ॥)
చెలియ సంతోసాలు చేరి మోమునఁ దేరఁగా
తలవంచుకొని చూచీ తనదిక్కు
సెలువల నగవులు చిందుచుఁ జిమ్మీరేఁగఁగా
నిలువుటద్దముదిక్కునీడలుచూచీని
(॥పడఁ॥)
అంగన తమకములు అట్టె పైపైఁ బెనఁగగా
కంగులేక చూచీ నాకాఁగిటిదిక్కు
ముంగిట శ్రీ వేంకటేశ ముందు నీవు గూడఁగను
పంగెనలేనిచనువు భావించి చూచీని
(||pallavi||)
paḍam̐ti valabulĕllā bayaḍam̐baḍĕnu nem̐ḍu
kaḍaleni priyamudo kām̐giliṁchavayyā
(||paḍam̐||)
sadisĕmaḍalerulu sannulavĕṁṭam̐ gāram̐gām̐
dadido sigguluvaḍīm̐dā ninnum̐ jūsi
madidom̐baravaśhālu machchigalum̐ dŏṭṭam̐gānu
radim̐ delagilam̐ jūsī ravvagā kannulanu
(||paḍam̐||)
sĕliya saṁtosālu seri momunam̐ deram̐gā
talavaṁchugŏni sūsī tanadikku
sĕluvala nagavulu siṁdusum̐ jimmīrem̐gam̐gā
niluvuḍaddamudikkunīḍalusūsīni
(||paḍam̐||)
aṁgana tamagamulu aṭṭĕ paibaim̐ bĕnam̐gagā
kaṁgulega sūsī nāgām̐giḍidikku
muṁgiḍa śhrī veṁkaḍeśha muṁdu nīvu gūḍam̐ganu
paṁgĕnalenisanuvu bhāviṁchi sūsīni