Padamti neppudu neevu paayanivaamdave kaaga

పడఁతి నెప్పుడు నీవు పాయనివాఁడవె కాక
Language

(॥పల్లవి॥)
పడఁతి నెప్పుడు నీవు పాయనివాఁడవె కాక
నిడి సాగిలె నీపెకు నీమీఁది చింత

(॥॥)
నెలఁతకొప్పుపై నవే నీవువెట్టినసేసలు
తలఁచుకున్నది నీతగుబాసలు
వలపులలో నున్నది వడి నడి యాసలు
యెలమి నీవెందుండినా నిఁకనేల చింత

(॥॥)
చన్నులపైనే వున్నవి చక్కనినీరేకలు
సన్నల నవ్వేనవ్వులసమజోకలు
కన్నులెదుట నున్నవి గక్కన నీరాకలు
మన్నిం చెప్పుడు వచ్చినా మరియేల చింత

(॥॥)
కూడినకాఁగిట మించె గురుతైననీ పొందులు
వాడికెమోవితేనెల వచ్చె విందులు
యీడనె శ్రీవేంకటేశ యేలితి వీకె నిట్టె
జోడుగా ఫలించె నీకుఁ జూపనేల చింత

(||pallavi||)
paḍam̐ti nĕppuḍu nīvu pāyanivām̐ḍavĕ kāga
niḍi sāgilĕ nībĕgu nīmīm̐di siṁta

(||||)
nĕlam̐tagŏppubai nave nīvuvĕṭṭinasesalu
talam̐sugunnadi nīdagubāsalu
valabulalo nunnadi vaḍi naḍi yāsalu
yĕlami nīvĕṁduṁḍinā nim̐kanela siṁta

(||||)
sannulabaine vunnavi sakkaninīregalu
sannala navvenavvulasamajogalu
kannulĕduḍa nunnavi gakkana nīrāgalu
manniṁ sĕppuḍu vachchinā mariyela siṁta

(||||)
kūḍinagām̐giḍa miṁchĕ gurudainanī pŏṁdulu
vāḍigĕmovidenĕla vachchĕ viṁdulu
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidi vīgĕ niṭṭĕ
joḍugā phaliṁchĕ nīgum̐ jūbanela siṁta