పడఁతి నీపతిఁ దెచ్చే భ్రమయకువే
(॥పల్లవి॥)
పడఁతి నీపతిఁ దెచ్చే భ్రమయకువే
యెడయని నీ తమక మేమని చెప్పేదే
(॥॥)
వెన్నెలబయటనుండి వేసవియండ లనేవు
అన్నిటాఁ జంద్రుని రవి యని యాడేవు
పన్నిన చిలుకలను పక్కెర గుఱ్ఱాలనేవు
యెన్నరాదు నీవిరహ మేమి చెప్పేదే
(॥॥)
తుమ్మిదలఁ గనుఁగొని దొడ్డయేనుగ లనేవు
కమ్మిన చిగురులే కత్తులనేవు
కమ్మరఁ గోయిలలను కాముని దూతలనేవు
యెమ్మెల నీవలపులు యేమి చెప్పేదే
(॥॥)
వేడుకతోఁ జల్లగాలి వింతమాసటీఁ డనేవు
వీడెపు గప్రము చలి వేఁడి యనేవు
కూడె శ్రీవేంకటేశుఁడు గొబ్బున నిన్నింతలోనే
యీడనే నీభాగ్యమిఁక నేమి చెప్పేరే
(||pallavi||)
paḍam̐ti nībadim̐ dĕchche bhramayaguve
yĕḍayani nī tamaga memani sĕppede
(||||)
vĕnnĕlabayaḍanuṁḍi vesaviyaṁḍa lanevu
anniḍām̐ jaṁdruni ravi yani yāḍevu
pannina silugalanu pakkĕra guṭrālanevu
yĕnnarādu nīviraha memi sĕppede
(||||)
tummidalam̐ ganum̐gŏni dŏḍḍayenuga lanevu
kammina sigurule kattulanevu
kammaram̐ goyilalanu kāmuni dūdalanevu
yĕmmĕla nīvalabulu yemi sĕppede
(||||)
veḍugadom̐ jallagāli viṁtamāsaḍīm̐ ḍanevu
vīḍĕbu gapramu sali vem̐ḍi yanevu
kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu gŏbbuna ninniṁtalone
yīḍane nībhāgyamim̐ka nemi sĕppere